పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మార్చి 2014, మంగళవారం

Vakkalanka Vaseera కవిత

సీమంతం నిన్నటివరకూ వీడు తెల్లవారు జామునే నా పక్కలో చేరేవాడు డొక్కలో దూరి కాళ్లు ముడుచుకుని మరీ వెచ్చగా పడుకునే వాడు రోజూ వీడికంటే ముందుగా నేనే నిద్రలేచేదాన్ని వీడిని ఎంతలేపినా ఆ దుప్పటి తీసి ఓ అంతట తల బయటపెట్టేవాడు కాదు రెండు చెవుల్లో సింధూర మందారాలు పెట్టుకుని వాటి మధ్యలోంచి బద్ధకంగా ఓ చిరునవ్వు విసిరి మళ్లీ ముసుగేసేవాడు నిజం చెప్పాలంటే రోజంతా ముసుగులోంచే ఓరగా చూస్తూ మొత్తగా నవ్వుతూ ఆడేవాడు అమ్మ వీడి బుగ్గ గిల్లి బహుశ దక్షిణంవైపు ఒత్తిగిలేలా పడుకోబెట్టినట్టుంది అంతే వీడికేదో అయ్యింది నాకంటే ముందే నిద్రలేస్తున్నాడు. నేను లేచేసరికే ఎర్రటి కళ్లతో చురుక్కున చూస్తున్నాడు వీడో చిత్రకారుడనే సంగతి నాకసలు తెలియనే తెలియదు ఆకుల్లో దూరి రంగులు మార్చేస్తున్నాడు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగుల్ని ఎన్ని రకాలుగా కలిపి ఎన్ని కొత్త ఛాయలు సృష్టించ వచ్చో చూపిస్తున్నాడు ఒక్కో ఆకుమీదా రెండు రంగుల్లోనే వంద రకాల వర్ణక్రీడల నీడలు చూపిస్తున్నాడు మెజీషియన్లాు కొమ్మల్లోకి మునివేళ్లు దూర్చి నీటిగదుల్లో నిద్రపోయే చిగురులని బైటికి లాగుతున్నాడు చిగురుటాకుల బుగ్గలమీది కొత్తరంగుల్ని తన ఇష్టానుసారం దిద్దుతున్నాడు వీడికేమయ్యిందో తెలియదు ఒక్క ఆకు కూడా లేకుండా ఎండి రాలిపోతాయనుకున్న కొమ్మలకి సకల వర్ణాలతో విరగబూస్తున్నాడు వీడితో పాటు మంచులో సుప్తమైన సమస్త వర్ణమయ తేజస్సులనీ పూలలోంచి పలికిస్తున్నాడు పూలగాజులు తొడిగిన కొమ్మల చేతుల్లోని చేటలనిండా రంగుల్ని నింపి దిక్కుల చివరిదాకా తూర్పార బడుతున్నాడు ఎప్పుడో తెలియదుగానీ చూస్తూ చూస్తుండగానే మొత్తంచెట్టునే ఓ అతిపెద్ద పూలగుత్తిగా మార్చాడు నా ఇంట్లో చెట్లనీ నా వీధిలో చెట్లనీ నా ఊర్లో చెట్లనీ పూనకంలా పట్టుకున్నాడు గాలిలో కనిపించని పూనకంలా ఊయలూగుతూ రంగుల తరంగాలై కేరింతలు కొడుతున్నాడు అక్కడితో ఆగలేదు ఈ అబ్బురాల చమత్కారుడు అడవిమీద పడ్డాడు తన భుజం మీది అంగీలా పర్వతాలు మీద మండు టెండని పరిచేశాడు రంగులుమారి ఎండి రాలే ఆకుల్ని మూటకట్టుకుంటూనే అడవంతా గుట్టలు గుట్టలుగా రంగుల ద్వీపాలను నింపేశాడు. ఒళ్లంతా పుప్పొళ్ల వసంతం చల్లుకుని నానా వర్ణమయ ద్వీపాల మీది సుగంధాల్లో ఎండ రెక్కలు విప్పి ఏకాకిగా ఎగురుతున్నాడు అనంతంలో కొత్త శక్తులతో వికసించిన అగ్నిపుష్పాన్ని తురుముకుని పుడమి తల్లి కొత్తజీవంతో పులకించడం పుడమికి సీమంతంలో వసంతం ఇదేనా!!! ఇదేనా!!! ఇల్లిదేనా!!! వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYxg73

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి