పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మార్చి 2014, మంగళవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జగన్మిధ్య..: ఏవి చెలీ నీ నయనాల తోనల తొణికిసలాడు సుమనోహర రసోద్దీపనా చంద్రికల సహస్రాలు..? ఏవి చెలీ నీ అధరాల తేనియ జలపాతాల తేలియాడిన వాక్ గంగా సుమధుర స్వర ప్రవాహాలు..? ఏవి చెలీ నీ ముఖ మందారముపై శాశ్వతమై సేదదీరిన మార్ధవపు సొగసుల సౌదామినులు..? ఏవి చెలీ నీ హృదయ కమలమున తిష్టవేసిన ప్రణయ సుధా మాధురీ మహిమల మహాద్భుతాలు..? ఏవి చెలీ నీ కమ్మని కౌగిలిన రేగిన మమతల తరగల మధురోహల మకరందాలు..? ఏవి చెలీ నీ ప్రేరణా శరముల పాశుపతపు ప్రచండ తరంగాలు..? నా జీవన ఎడారిలో ఎలకోయిల ఎందుకు నీ పిలుపు లేనిది..? నా జగత్తు మిధ్యే కదా నీలో నా తలపు రానిది..? 17/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి