పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Rishi కవిత

ద్వంద్వ సమాసం - దాసరాజు రామారావు శ్రావ్యంగా వినడానికి వీనులు గావాలె అరవై ఏండ్ల కల వలపోతని వినకపోవడానికి బ్రహ్మ చెవుడు గావాలె తెరిపిలేని వీక్షణానందానికి అక్షులు గావాలె తనువుల నంటువెట్టుకుని బతుకుల బుగ్గి చేసుకున్న అమర దృశ్యరూపాలు కనబడకపోవడానికి గుడ్డి కనుగుడ్డొకటి గావాలె తెలుగు తేనియలు చప్పరించడానికి సమైక్యపు లాలాజలంలో ఈదడానికి రుచికరమైన నాలుక గావాలె ఆంబుక్క పెట్టడానికి అడ్డుకునే అడ్డగోలు మాటల కోసం మడత పడ్డ నాలుక కూడా గావాలె హాస రేఖల ప్రదర్శనకు ముఖారవిందం గావాలె ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినట్టు టీవీలో చూపినపుడు వికృత ప్రకోపాల జేవురింపు మొహం అత్యవసరంగా గావాలె విశ్వాన్ని ప్రేమించగలిగే విశాల సహృదయత గావాలె నోటికొచ్చే బుక్క నెత్తగొట్టడానికి ఎంతకైనా దిగజారే కుత్సిత మనసు గట్టిదే ఖచ్చితంగా గావాలె కుప్పమో కడపకో తప్ప తంగెళ్ళు దాటని కాళ్ళతో సీమ చెట్టుకో, కోస్తా మిర్చికో తప్ప పెట్టుపోతలు జరుపని చేతులతో వెయ్యికాలాల పెత్తనం ఎన్నికల్లేకుండా మాకే గావాలె ప్యూపాదశ నుంచీ సీతాకోకచిలుక అయ్యేవరకూ 1953 అనంగీకార కలివిడి మొదలు 2013 నిరవధిక కన్నారని ఆకాంక్ష వరకూ అడ్డుకొంటూనే వుండాలె అయితే గియితే అన్నీ అన్నీ అన్నీ వున్న హైదరబాద్ మాకే గావాలె విడిస్తే గిడిస్తే మా భీషణ ప్రతిజ్ఞలేం గాను తొడగొట్టిన పౌరుషాలేం గాను తేరగా మేసే మా నోరేం గాను అంచేతా మేమందరం గుడ్క వొదల బొమ్మాళీ నిన్నొదల…!!! (వాకిలి, ఫిబ్రవరి-2014)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bZlyQO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి