పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి నా గదంతా చీకటి కమ్మేసింది నా నేస్తమై నన్ను చుట్టేసింది కళ్ళు తెరవగానే ఒక్కసారిగా వచ్చి నన్ను కౌగిలించుకుంది.. బహుశా తనను ఎవరు ఇష్టపడకపోవడంవల్లేమొ నేనంటే అంత ప్రేమ తన శరీరాన్ని నా ముందు పరిచింది నగ్నంగా నేనెం చేయలేనట్టు తన ఒళ్ళంతా తడిమి చూశాను ఎక్కడైనా వెలుగు చుక్కలు అద్దుకుందేమోనని ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది నేను తాకిన ప్రతిసారి నేనడుగుతుంటాను తనని... నీ ఒంటి నిండా ఈ నల్ల రంగేమిటని? ఒక చిరునవ్వు(చీకట్లోనే)­ నవ్వి అంటుంది నేను మాత్రమే స్వచ్చంగా ఉండగలను ఎవరు ఆస్వాదించినా,మరెవరు అసహ్యించుకున్నా అని... అప్పటినుండి తనను నాలోకి నింపుకుంటూనే ఉన్నా ఇష్టంతో తనొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ప్రతి రాత్రి నాతో రమిస్తూనే ఉంటుంది తన నలుపు వర్ణాన్ని నా ఒంటికింత పులుముతూ ప్రతిరాత్రి తన ఒళ్ళోనే భావప్రాప్తి పొందుతుంటాయి నా చిక్కని జ్ఞాపకాలు ఇంకా నా పక్కనే తనను పరచుకొని పడుకుంది నాతోనే.... తిలక్ బొమ్మరాజు 04.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fWIcML

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి