పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జూన్ 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

రేపటిపొద్దు మోడు పూలకొమ్మయింది చిగురాశ లేని మొండి జీవితంలో బండమీద నీటిచెలిమె లెక్క గడ్డకట్టిన మనసు ఇపుడు రెక్కలు విప్పిన పక్షి పారతో మలిపిన కాలువ మడి నిండినట్లు ఆవిరులైన వూహలన్నీ అందాలవానలైనయి తడిసినకొ్ద్ది నేనే వూటపర్రెనైనా మత్తడి దుంకుతున్న కలలు జొన్నకర్రల దసరా జెండాలైనయి ఈ పంటచేను మంచె రాగాలమీద నవ్వుల వెన్నెలలు కురిసినయి ఏడెల్లకాలం దుఃఖాన్ని ఒల్లెకు తీస్కొని వూకుంచినట్లుంది ఈ పొద్దు మోదుగులు పూచినట్లున్నాయి వూర్లనిండా పాలపిట్టలు పాటల కవ్వాతు చేస్తున్నయి సేపులొచ్చిన తల్లిలెక్క తెలంగాణా బిడ్డల్ని దేవులాడుకుంటున్నది కన్నబిడ్డల్ని గుండెలమీదనే కాల్చుకున్న దీన దుఃఖాన్ని మింగుకుని కాలాన్ని గెలిచిన పండుగ బోనం ఎత్తుకుంటున్నది కొత్తలు పెట్టుకుందాం, కొత్త ఆశలు తొడుక్కుందాం గంపనిండా కొత్తపొద్దుల ధాన్యం రండి ఎత్తుకుందాం నేనొక విత్తనాన్నై మళ్ళీ మొలకెత్తుతా కాలం అన్ని రహస్యాలు చెప్పితీరుతుంది ఇంక చరిత్ర తెలంగాణాదే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfWdLn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి