పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జూన్ 2014, సోమవారం

Rambabu Challa కవిత

ఫలిత కేశం/ Dt.2-6-2014 నీజన్మ సార్ధకత ఏమిటని ఐదుపదుల వసంతాల్ని చూసిన మానవుడ్ని అడిగింది తొలిసారి తొంగి చూసిన ఫలిత కేశం ఏం చెప్పను? ఏమని చెప్పను? బాల్యం వెట్టిచాకిరీలో గడిచిందనా? కౌమారం కొంగ్రొత్త ఆశల పల్లకిలో ఊరేగిందనా? యవ్వనం విచ్చలవిడి శృంగారాగ్నిలో శలభమైందనా? ప్రౌఢం అక్రమార్జన వలలో చిక్కుకుందనా? ఏం చెప్పను? ఇంకా కోరికలు మిగిలిపోయాయని ఎలాచెప్పను? పదవికోసం పైరవీలు సాగిస్తున్నాని సంపన్నుల్లో సభ్యుడ్ని కావాలని విదేశాల్లో వైద్యం పొందాలని కులాసాగా విలాసాల్లో తేలాలని అన్ని అవకాశాలు కల్పించమని కోరికల చిట్టా విప్పాడు అందుకే జీవితకాలాన్ని పెంచమని దేవుడ్ని కోరుకుంటున్నాననీ చెప్పాడు అది విన్న ఫలిత కేశం నవ్వింది... తిమిరాన్ని తరిమిన వెలుగులా అజ్ఞానాన్ని బాపిన జ్ఞానిలా నీవున్నావనుకుని వెలిశానంది శేష జీవితాన్ని దేశ సేవలొ, క్రాంతి సేనలో శాంతివనంలో గడపమంది నా అవసరం నీకు లేదంది వెంటనే రాలిపోయింది.

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1onC8Ru

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి