పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

పర్యావరణ కవయిత్రి ప్రజాశక్తి - సవ్వడి -Posted on: Mon 02 Jun 00:09:57.651484 2014 ఇటు కవిత్వపు లోతుల్ని, అటు ప్రకృతి ఔన్నత్యాన్ని గ్రహించి జీవితాన్ని ఒక తాత్విక దృక్పథంతో అవలోకించిన మళయాల కవయిత్రి సుగతా కుమారి. ప్రకృతి - మానవుల సంబంధాన్ని కవిత్వీకరించిన కవయిత్రిగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడిన కార్యకర్తగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. నిబద్ధత, నిజాయితీ ఆమె వ్యక్తిత్వంలో ప్రధానాంశాలు. వాటిని ఆమె, ఆమె తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. సుగతాకుమారి 1934 జనవరి 3న బ్రిటిష్‌ ఇండియాలో పుట్టారు. తండ్రి బోధేశ్వరన్‌ గొప్ప కవి, స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన కూతురిగా ఆమె అనేక విషయాలు బాల్యంలోనే నేర్చుకున్నారు. దేశభక్తి, జాతీయభావన, నిర్భయత్వం ఆమె రక్తంలో ఇంకిపోయాయి. తల్లి ప్రొఫెసర్‌ వి.కె.కార్తియాయని.. సంస్కృత పండితురాలు, పరిశోధకురాలు. అందువల్ల తల్లి నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకున్నారు. సంస్క ృతి - సంప్రదాయాల పట్ల గౌరవం, జీవితంలో విలువల్ని నిలుపుకోవడం వగైరా సుగతా కుమారి తల్లి నుంచి స్వీకరించారు. భర్త డాక్టర్‌ కె.వేలాయుధన్‌ ఎడ్యుకేషన్‌ సైకాలజీ నిపుణుడు, అరవిందో ఫిలాసఫీ నమ్మినవాడు. అక్క హృదయకుమారి కూడా రచయిత్రే. ఆమె కూడా కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతే. కాల్పనికత మీద ఆమె కృషి చేశారు. ఈ విధంగా సుగతా కుమారికి గొప్ప కుటుంబం లభించింది. కవయిత్రిగా, పర్యావరణ కార్యకర్తగా ఆమె ఎదగడానికి కుటుంబ నేపథ్యం ఎంతో ఉపయోగపడింది. మొదటిసారిగా 1957లో ఆమె ఒక వారపత్రికలో కలంపేరుతో కవిత ప్రచురించారు. ఆ తర్వాత రచనల వేగం పెరిగింది. సున్నితమైన తాత్వికాంశాలు అక్షరబద్ధం చేయనారంభించారు. క్రమంగా ఆమె కవిత్వంలో ఉద్రేకం, బిగువైన పదాల అల్లిక, భావస్ఫోరకమైన పదబంధాలు, సరళత, ప్రవాహవేగం కనిపించసాగాయి. 'పటిరప్పుక్కళ్‌'కు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 'రాత్రిమజ్జా' (రాత్రివర్షం) సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య ప్రవర్ధక అవార్డూ లభించాయి. 'అంబాలమణికల్‌'కు ఒడక్కుజాల్‌ అవార్డు, ఇడుత్తచ్చన్‌ పురస్కారం మాత్రమే కాక ఆశాన్‌ అవార్డు, వలయార్‌ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ వగైరా ఎన్నో లభించాయి. సుగతాకుమారి ప్రకటించిన తన అన్ని సంపుటాలకు కవితా ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమైనవి చెప్పుకోవాలంటే 'ముతుచిప్పి' (ముత్యపుచిప్ప), 'ఇరుల్‌ చిరకుకల్‌' (చీకటి రెక్కలు) 'స్వప్నభూమి' 'పథీర్‌ అప్పూుకల్‌' (అర్ధరాత్రి పూచే పూలు), 'పావం - మానవ హృదయం' (పాపం! మానవ హృదయం) మొదలైనవి. సుగతాకుమారి ఎన్నో అనువాద రచనలు కూడా చేశారు. బాల సాహిత్యంలో ప్రత్యేకంగా కృషి చేశారు. 'తలిరు' అనే పిల్లల పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగరీత్యా కేరళ రాష్ట్ర - జవహర్‌ బాలభవన్‌కు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కొంతకాలం కేరళ రాష్ట్ర మహిళా సంక్షేమ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ కాలంలోనే దగా పడిన మహిళలకు రక్షణనిచ్చే సంస్థ 'అభయ'ను తీర్చిదిద్దారు. మానసికంగా దెబ్బతిన్న వారికి కేర్‌ సెంటర్‌ ప్రారంభించారు. 1955లో తన 21వ ఏట ఫిిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్న సుగతాకుమారి, తిరువనంతపురం మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. తిరువనంతపురంలోనే స్థిరపడి, అక్కడే ఉద్యోగం చేసి అక్కడే పదవీ విరమణ కూడా చేశారు. ఈమెకు ఐదారు భారతీయ భాషలతో బాగా పరిచయం ఉంది. ఇవన్నీ కాక తిరువనంతపురంలోని ప్రకృతి సంరక్షణ సమితి (సొసైటీ ఫర్‌ కన్వర్షన్‌ ఆఫ్‌ నేచర్‌)కి సెక్రటరీగా ఉన్నారు. జనంలో ఒక అవగాహన, చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆమెకు 'ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు' - 2003 లభించింది. దానితో పాటు సామాజిక సేవకు గుర్తింపుగా 'లకిë అవార్డు' కూడా లభించింది. భాతర ప్రభుత్వం 2006లో పద్మశ్రీ అవార్డుతో, 2012లో కె.కె.బిర్లా ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మకమైన 'సరస్వతీ సమ్మాన్‌'తో సత్కరించాయి. బహుముఖాలుగా సాగిన సుగతాకుమారి జీవితం, సాహిత్యం మళయాళ ప్రజలకు మాత్రమే కాదు, భారతీయులందరికీ ఆదర్శప్రాయమే! - డాక్టర్‌ దేవరాజు మహారాజు http://ift.tt/1wQ872o

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wQ872o

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి