పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Rambabu Challa కవిత

ఆఖరి ఘడియ/ Dt. 1-6-2014 తొందరగా ఎదగాలని ఎన్నో కలలు కన్నాను వయసొచ్చి పలకరిస్తే పులకించి పోయాను మూడు ముళ్ల బంధానికి తలవంచి నడిచాను పైసాయే పరమార్ధమనే మెట్టినింట ఆరిళ్లను నవ్వుతూనే భరించాను నేనూ ఓ మాతృమూర్తినై సృష్టికి స్ఫూర్తినవ్వాలని తలంచాను పొత్తిళ్లలో తనయుని చిగురుటాకుల్లాంటి పాదాలను చెక్కిళ్లకు ఆనించి తన్మయత్వం చెందాను "నాతిచరామి" ప్రమాణాన్ని మంటగలిపి ఇంకో నాతితో భర్త చరించినపుడూ బాధపడలేదు కడుపుకట్టుకొని చంకనేసుకొని తండ్రిలేని లోపాన్ని రానివ్వక కొడుకుని పెంచాను నాగమ్యం నాకుందని నా భవితవ్యం నేనెరుగుదునని రెక్కలవిమానంలో చక్కా ఎగిరిపోయాడాకొడుకు భవసాగరం నడుమ వదలివెళ్లిన అతనూ మగాడే చివరి మజిలో ఒంటరిగా వదలి వెళ్ళిన ఇతనూ మగాడే ధరిత్రికున్నంత సహనం గల వనితను సృష్టి యజ్ఞంలో ఓసమిధను ఎదురు చూస్తున్నాను ఆఖరి ఘడియకోసం

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wL8sn0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి