పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Kavi Yakoob కవిత

యాకూబ్ | ఇవాళ ......................... కలలు కంటాం. మెలకువలోని మెళకువలుగా లోపలెప్పుడూ నిక్షిప్తంగా అవి దాక్కునే వుంటాయి. మనమేమిటో నిజమేమిటో, అబద్దమేమిటో అంతా వాటికి తెలుసు. వాటికే తెలుసు. అసలు జీవితంలోని అర్థభాగం, ఇంకా ఎక్కువ అవే . ఊపిరాడని సందోహం మధ్యన పరుగులు పెడుతున్నప్పుడు ,అవి మనలోపలి నిద్రలోంచి కళ్ళు తెరిచి అన్నీ గమనిస్తూ ఉంటాయి. బహుశా నిద్రలో దాక్కున్నప్పుడు మనం ఉన్నా లేనట్లేనేమో. 1 మనిషి అసలు స్వరూపం బయటికి వెలికివస్తున్నప్పుడు, ఎవరైనా గమనిస్తున్నారని తెలియడమే నిజమైన శిక్ష. అబద్దపురూపం కరిగి అసలుసిసలుతనం వెలికివచ్చేసమయాలు కలలు ఉరివేసుకునే క్షణాలు. 2 నిన్నటిలా ఇవాళలేనట్లే, రేపు అసలే ఉండదు. అయిందేదో అయింది, అంతా ఇలానే అవుతుంది. కలలు కనడం మాత్రం మానలేం. అవి మాత్రమే మనం- నువ్వూ నేనూ . కలలు కందాం.ఇవాల్టిలాగే ,రేపు కూడా ! *1.6.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHZTQC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి