పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

రెండు రాష్ట్రాలు-మూడు ప్రాంతాలు| KVVS MURTHY ----------------------------------------------------- ఒక చారిత్రక సన్నివేశం ఆవిష్కరింపబడుతున్నవేళ నా మాట నేను చెప్పకపోతే మరెవరు చెబుతారు..? తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి చివరికి అయితే మూడు ప్రాంతాలు గా తేలాయి ఇపుడు... ఆ మూడవది ఏమిటా...? అదే భద్రాచలం ప్రాంతం..! అవును నిజం... మా భాషలో యాస లేదని ఆంధ్రా వాళ్ళమంటారు ఇటువాళ్ళు మా ప్రాంతం ఇవతల ఉన్నది కాబట్టి తెలంగాణా వాళ్ళమంటారు అటువాళ్ళు...! మేమెవరిమో మాకే తెలియని పరిస్థితి రాముడి గుడినుంచి రెండు అడుగులేస్తే సీమాంధ్ర రాముడు మాత్రం తెలంగాణా... ఎవరినీ ద్వేషించలేని స్థితి పగవాడికి సైతం రాకూడదు ఈ గతి ఎలాగు పల్లె లోనూ ,నగరం లోనూ బ్రతికేయగల దేశద్రిమ్మరినే గదా.. ఏ చెన్నయ్ నో... భువనేశ్వర్ నో చెక్కేస్తే బాగుండుననిపిస్తుంది నాకైతే... --------------------------------------------------- 01-6-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0h580

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి