పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జూన్ 2014, శనివారం

Maddali Srinivas కవిత

కింకర్తవ్యం?//శ్రీనివాస్//21/06/2014 --------------------------------------------------------------- మాయదారి మణికట్టు గడియారం కనికట్టు నేర్చిందో యేమో?! కాలం కదలక మొరాయిస్తుంది దూరం సాగి సాగి చాలా , దూరమైపోతోంది గమ్యం మాయలా మృగ తృష్ణ లా మిణుక్కుమంటూ మెరుస్తుంది అప్పుడే కనుమరుగై మాయమైపోతుంది అనుభవానికొస్తే గాని సాపేక్ష తత్వం బోధపడలే కాలం జల్లెడ పడితే రాలి పడిన రేణువులా నేనొక్కడినే నిశ్చలంగా వున్నట్టూ, అందరి పయనం నిరాటంకంగా సాగిపోతున్నట్టు యెందుకిలాగౌతుందో యేమో కానీ, యెన్ని సార్లైనా అంతే!! బొక్కబోర్లా పడ్డప్పుడల్లా యేదో అనుభవమౌతూనే వుంటుంది యేదో తత్వం అవగతమౌతూనే వుంటుంది కొత్త పాఠం ఆచరణలో పెట్టేలోగా, తరుముకొచ్చే క్షణాలు కొన్ని మళ్ళీ నన్ను మింగేస్తాయి??? మళ్ళీ నేనోక్కణ్ణే నిశ్చలంగా................. ప్రపంచమంతా వేగంగా............... నా చుట్టూ నేనే పరిభ్రమిస్తున్నానేమో కాలమా చెప్పమ్మా!!! నేనొక వివిక్త వ్యవస్తనా? లేదా నేనొకానొక అవ్యక్తావస్తనా? కనికరముంటే కనికట్టు విప్పమ్మా? కర్తవ్యం చెప్పమ్మా!!!!!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1puJUvo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి