పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జూన్ 2014, శనివారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మళ్ళా వచ్చాను|| ======================= నేనే! కొన్ని అక్షరాలను ఏరుకుని గడ్డి పరకల తాడు కట్టుకుని మళ్ళా కనిపించాను బలవంతమైన ఐరావతమాటల కోటల బీటలు తీద్దామని నేనే ! కుల పాద గురుతులు చెరిపేద్దామని పశు చర్మాన్ని చెప్పులుగా కుట్టుకుని ఒంటరిగా వచ్చాను అంటరాని వాడలోకి సుతి మెత్తని అడుగుల చప్పుడుతో నేనే ! కాలగర్భంలో కలిసి పోతున్న కన్నీటి గాధలను మూట గట్టి కరుడు గట్టిన హృదయాన్ని మోసుకొచ్చాను వెలిబతుకుల గుండె చప్పుడు వినాలని నేనే ! నిత్యం బలి బతుకుల అన్వేషణలో ఆకలి మెతుకుల వెతుకులాటలో ప్రతి రోజు కుబుసం విడుస్తున్నాను ఐనా... ఛారలు ఆచారాలై వెక్కిరిస్తున్నాయి నేనే ! నగ్న సాహిత్యం దిగంబరమై గేలీ చేస్తుంటే రంగుల అక్షరాలను అంకురాలు చేసుకుని హోలీగా విత్తాలని వచ్చాను నేనే ! మసక బారిన అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటూ పొగ చూరిన దీపంలో నిన్ను వెతుక్కుంటూ మళ్ళా వచ్చాను . ఇంకా నా కళ్ళ ముందు అవే మాటలు నా కాళ్ళ కింద అవే గురుతులు శిధిల జ్ఞాపకాలు ..... ================ జూన్ 21/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uNRTDe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి