పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, జూన్ 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

. నాళేశ్వరం శంకరం|| గాయం కాని రోజు లేదు|| . గాయం కాని రోజు లేదు అంతిమ గాయాక్షరం రాసి మరీ గాయం చేయనూ లేను. గాయమే నా హృదయమైనప్పుడు పెదాలమీంచి జారే ప్రతి స్వరం గాయస్వరమై కూర్చుంటుంది. . వ్యర్థంగా ప్రాణం కదలాడటం అలవాటైపోయింది జీవనసాఫల్యంతో నన్ను మోసే చెప్పులూ వేసుకున్న చొక్కా తొడుక్కున్న ప్యాంటూ తినే తిండీ తాగే నీరూ పీల్చేగాలీ నాకోసం సహకరించే ఈ సమస్తం సజీవంగానే బతుకుతున్నాయి సాఫల్యంలేని నా యీ కాయానికి సహకరిస్తూనే ఉన్నాయి నేనుమాత్రం నిరుపయోగంగా పెరుగుతున్న నేల బరువుని. నేనో ఉద్యమ నెలబాలుడ్నైనా కాకపోతి దాని ధ్యాన ధారగా ప్రవహించకపోతి ఏమీకానినేను ఎంతకాలమిక్కడ పరుండేది ఈ నిర్వీర్యపు నిస్సత్తువతో నా యీ అవయవాల్ని నాకునేను కష్టాలపాలు చేయడం సహిం చలేను. . ఆనవాళ్ళు గుర్తుపట్టలేనంతగానైనా నాకో ఏక్సిడెంటయి తునాతునకలైపోతే బాగుండు నాకు నేను ఏమీకానివిధంగా ఎగిరిపోతే బాగుండు మేల్కోలేని నిదురలోకి ఒదిగిపోయి నా శరీరానికి ప్రణమిల్లితే బాగుండు ఆత్మతృప్తితో నా తనువు మట్టితో మమేకమైపోతే బాగుండు . ఆత్మాహుతిని ప్రేరేపించే ఈ వ్యవస్థ హననం కాకపోవడమే నేరం! ఏం చెయ్యనూ? నన్నేమీ కానీకుండా ఇలానే మ్యూజియంలోని బొమ్మలా ఈ వ్యవస్థకు వేళ్ళాడే రేపటి భవిష్యత్ పటానికి మల్లే రోజూ నాకు నేనే అగుపడి నన్నునేను చూసుకోవడమెందుకు? గాయాలతో తడిసిముద్దయిపోతున్న దగాపడినవారిలో ఐక్యంకాని యీ దేహమెందుకు? నన్ను నేను హింసించుకుంటూ ఈ బ్రతకమెందుకు? బాబ్బాబు! నన్ను బుజ్జగించే వ్యవస్థ ఒడిలే వదిలేకన్నా గాయమైన ఈ పిడికెడు ప్రాణాన్నీ కాలం కొయ్యమీదైనా వేళ్ళాడదీయవా! నీకూ కాలానికీ ఋణపడిఉంటాను నేను రాసే బానిసగాయాక్షరాల చరిత్రలో గాయంగానైనా మిగిలిపోతాను. గాయాల వాగ్గేయకారులకు గానంగానైనా మిగిలిపోతాను. . నాళేశ్వరం శంకరం. “దూదిమేడ” కవితా సంకలనం నుండి. :http://ift.tt/UlNoVr

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UlNoVr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి