పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

అంతర్యుద్ధం ప్రపంచాన్ని పరమాద్భుతంగా మోసగించేస్తూ // అంతరాత్మ కుత్తుకలో కత్తులుదిగేస్తూ // నేనేదో ఇంటలిజెంట్ ఐన్స్టీన్ అనుకొంటే // నిద్ర రాని రాత్రి కళ్ళతో బాటు గుండే మండిస్తుంది// నాలిక చివరి న్యాయ వచనాలు నిలువెత్తు ప్రశ్నలై ఎదురొచ్చి బెదిరిస్తాయి// అచరణ తప్పిన ధర్మ పన్నాలు పిలవని భూకంపాలై కుదిపేస్తాయి // ఎప్పుడూ కనిపిచే నేను నేను కాదేమో // అద్దంలో చూచుకొన్నా అర్ధం కానేమో // హౄదయపు చీకటి లోతుల్లో అగ్న్యాత భూతం క్రీనీడలు // ఏ సీసాలో బిరడా కొట్టీనా తొంగి చూస్తొందేం // నీకు నేను అర్ధం కాలేదంటే ఒక అర్ధం ఉంది // నాకు నేను అర్ధం కాక పోవడం ఎంత అసంగతం // అసత్య భుజకీర్తుల బరువుతో కుదించుకు పోయి // అబద్ధపు స్వాంతనా మాదకపు మత్తుకు అలవడి// స్వకీయ గుణ కీర్తనా గాత్ర కచ్చేరి లో // సత్యం వణికి పోతు స్వరం సరిగా పలకలేక పోతుంది // నేను నటించటం మానుకుంటే నిజం బరువు కింద మరుక్షణం మరణిస్తానేమో // 10/5/13

by Venkata Hanumantha Ramakrishna Tummalachervu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maOddD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి