పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //ఉన్నానింకా// అస్థికలు పైన వేసుకు తిరుగుతున్నా చావని అస్తిత్వపు మూలుగలోంచి తన్నుకొస్తున్న మూలుగు నేనున్నానింకా.. దుగ్ధ భ్రమ పేరూ పెద్దిర్కం నానానూననూనెల్లో గోలుతున్న అభిరుచుల వితానవాసనల ఘుమఘుమలకు మూసుకుపోయిన కళ్లు మండించే కుముటు పాడు పాడు.. మాడు మాడు ఈ మాడు వాసన చివరాఖరు జ్వలనంలోనూ నేనున్నానంటూ ఫట్మని ఉనికి చాటుకునే ఉన్మత్త ప్రేలాపన చంకలు కొట్టుకుంటూ వేవేల కాపీల కుప్పల స్వీయ సంకలనాల నిచ్చెనెక్కుతూ రొప్పుతూ... రోలుతూ.. బతుకంతా పిడకలు చరిచిన గోడకే తానూ అవార్డు ఫలకమై వేలాడుతూ.. వేరీ బ్యాడ్.. బేడే.. బేడా అణా కాలణా కాలం నాటి తనువుల అణువణువుల అనుభవసారాదీపాల ధూపాల మసి కస్తురితిలకంగా దిద్దుకు సాగిపోరా..! పోరా..! పోర.. పోరితే పోయేదేం లేదురా..! పోయేదేం లేకుంటే పోరాటమేలరా..! కవిత్వమో కళ.. కళా చతురిమ.. తురుముకోరా నీ తలన పేరు పెద్దనల తోవన ఆతోవ ఈతోవ ఏతోవ కాదని తోవల నడుమ తిప్పకు మడిమ వుత్తి గోల కాదు కవిత్వం అని కేవలం కళాకాదు అది నీ అనుభూతి ఆవిష్కారం మనల్ని కదిలించే పరిష్కారం ఎంత శల్యమైపోనీ లోన గలగల లాడే విత్తుల ఎండుకాయ ఈ కవిత్వపు బొంది. 10/5/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oBAY5h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి