పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Sriramoju Haragopal కవిత

ఇల వేలుపు పొలంలో నాలుగు మొలకగింజలు అలుకు చల్లినపుడు నేలనుంచి ఎదిగొచ్చిన మొక్కల రెండాకులు చల్లిన వాడి చేతులకు మొక్కినట్లుంటయి చల్లని పదునుకు పులకరించిన పచ్చటి చుక్కల్లెక్కుంటయి ఒరమెక్కిన గడ్డిపూలు ఉయ్యాలపాటలు పాడినట్లుంటది మండెగట్టినపుడేమెరుక ఇన్ని గింజలు మొలకపోసుకుంటాయని అలుకుబోనం పెట్టినపుడేమెరుక ఇన్ని కలలు మొలకెత్తుతాయని నాగేటిసాల్లల్ల పెల్ల పెల్ల కరిగి మట్టివాసనలు చల్లినపుడే రైతు జమకట్టుకుంటడేమొ కల్లంల రాశిపోసిన బతుకువెన్నెలలు కాలువల నీళ్ళే పారుతయో, చెమటలో, కన్నీళ్ళో పానాలుబిగవట్టి బురదలనుంచి చేన్లనుంచి బండికెక్కేదాకా కాలుగర్రు వడ్డ పసురం లెక్క ఎన్నిసార్ల లేస్తుంటడు పడుతుంటడు తేపతేపకు దూపగొన్నట్టె బతుకంత వగపోస్తుంటడు చేను దండం పెడ్తది చెలక దండం పెడ్తది పసులు దండం పెడ్తయి రైతుకు మనిషే అన్నం పెట్టిన చెయ్యికి నమ్మకంగ వుండడు బువ్వకూడా గాలిలోంచి ఎవడో వేస్తడనుకుంటడు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nppaFJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి