పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/వాన దీపం ____________ గోడకు తగిలించిన దీపం రాత్రంతా వెలిగి వెలిగి ఇప్పుడే కొండెక్కింది ఒంటరిగా తనను తను కాల్చుకున్నాక ఒంటిపై మిగిలిన మసి ఇంటి చూరు కూడా చేతులు చాపి రేయంతా మెలకువగానే తోడుకుంది ఇంత చీకటిని ఎక్కడో దడాలున పగిలిన కీచురాళ్ళ శబ్ధానికి కొంచం జలదరిస్తూ ఒకింత అలజడి గాజు దేహం గుండా ముసలి వర్షమొకటి అప్పుడే అటుగా వెడుతూ తలతిప్పి చూసింది దహనమవుతున్న ఏకాంత ఒత్తిని/ఒక్కో చుక్కా రాలే కొద్ది నేలంతా తడిసిన వాసనతో నానుతోంది ఇక కొద్దిగానే నిండుకున్న చమురుతో నెట్టుకొస్తున్న ఆ పదార్థానికి శూన్యపు గాలికి కిర్రుమన్న చప్పుడు ఆకుల మధ్యగా కొన్ని పువ్వులు అప్పుడే రాలినట్టున్నాయి పసిరుచిగొడుతూ ఇంకెన్ని రాతులు దహనమవ్వాలో ఒంటరైనా ఆ గది కోసం తిలక్ బొమ్మరాజు 25.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TIMank

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి