పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వాస్తవికత ఆ చిన్న చిన్న స్వప్నాలు ఒక దానితో ఒకటి కలిసిపోయి చిక్కు పడిపోయి ఉన్నాయి ఎందుకంటే ఆ స్వప్నాల్ని తెరవకుండానే ఉంచేశాను జీవితంలో ఇంతవరకూ ఇప్పుడెంత ప్రయత్నించినా ఆ స్వప్నాలు వాస్తవాలు కావడం లేదు చిన్న చిన్న స్వప్నాలు కాలాన్ని మ్రింగేస్తాయని నా ఆశల్ని అడియాసలు చేస్తాయని తెలుసుకున్నాను అందుకే నా జీవితానికి సరిపోయిన ఒక పెద్ద స్వప్నాన్ని సృష్టించుకుంటూ ఆ స్వప్నాన్నే జీవితంగా మలుచుకుంటూ నన్ను నేను ఒక మనిషిగా ఆవిష్కరించుకుంటున్నాను! స్వప్నమంటేనే జీవితం అని జీవితం అంటే స్వప్నమని తెలుసుకున్న తరవాత స్వప్నఋషిగా మరి ధ్యానం చేసుకుంటూ వాస్తవికతలోకి పయనిస్తుంటే, ప్రవహిస్తుంటే జీవితం ఎంతో హాయి గా ఉంది! 25May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRcF4z

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి