పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఏప్రిల్ 2014, సోమవారం

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి పిదప ---------------------------- చీకట్లో నవ్వే నక్షత్రాలు/ కొన్ని కలలు కరగాలి కళ్ళ నిచ్చెనల పైనుండి తలపులన్నీ తపనలుగా మారి జీవించాలి సజీవ సమాధులపై మరోసారి నిర్జీవంగా నడవాలి రెక్కలు విదిల్చిన ఆకాశం/ తడిసి ముద్దవుతున్న ధాత్రి పగటి వెలుతుర్లు పడమరకెళ్ళాక మబ్బుల మాటునుండి తనను బయటపెడుతున్న చందురుడు అలుపెరుగనిరెక్కలు/ కొన్ని పక్షులు మళ్ళీ ఎగరాలి నింగి సరిహద్దులు దాటి పడిలేచే కెరటాలే/ పదే పదే సంద్రంలోనే తలదాచుకుంటూ ఇప్పుడు ఇంకొన్ని కొత్త వస్తువులు కొ(క)నుక్కోవాలి ఏకాకిగానే తిలక్ బొమ్మరాజు 20.04.14 28.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iwj7Mx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి