పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఏప్రిల్ 2014, సోమవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి “అహం” మేమిద్దరం రెండు సముద్రాలమై మేమిద్దరం రెండు ఆకాశాలమై మేమిద్దరం రెండు ప్రపంచాలమై మేమిద్దరం రెండు దృక్పధాలమై ఒకరితో ఒకరం పోటీ పడుతూ ఉంటాం ఇంతకీ మేమిద్దరం ఒక్కరమే కానీ అది తెలుసుకోలేక మాలోంచి మేము జారిపోతూనే ఉంటాం చివరికి ఏమీ కాక శూన్యమై మిగిలిపోతూనే ఉంటాం మేము ఒక్కరమే కానీ ఇద్దరిలానే ఉండిపోతున్నాం ఒకరిలా బ్రతకలేకపోతున్నాం అది మా అహం అదే మాకు సర్గం ఇంకెందుకు మాకు స్వర్గం! 28Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kdgAoc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి