పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sriramoju Haragopal కవిత

నీలిమేఘాలలో... మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నదులు నా కన్నీటికొలనులే సముద్రం నా దుఃఖం విడిది కొండలు నా బాధలతలగడలు చెట్లు నా వియోగగీతికల వీవెనలు అడవులు నా పచ్చని నిరీక్షణలపాట నువ్వు నన్ను విడిచిపోతావెక్కడికని నువ్వు నాలోని ప్రాణశ్వాసవు మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నీ జ్ఞాపకాలను మాయం చేసే ఏదైనా నదినీటిలో నన్ను పారేసి పో ఒక్కటి మిగిలినా పాటరెక్కల మీద ఎగిరి వచ్చేస్తా ఒక్కబొట్టు కన్నీరున్నా వాననై తడిపేస్తా నిన్ను నన్ను పారెయ్ పారెయ్ ఒక్క రుతువు చూసినా నా కళ్ళు రెప్పలతో నీ దివ్య రూపాల్ని దిద్దుతాయి ఒక్క పూవు పూసినా నా స్పర్శలు గాలితెప్పలతో నీ వాసనలు వీస్తాయి నన్ను పారెయ్ పారెయ్ మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నా దుఃఖశ్వాసల్ని ఎరుగనంత ఎదిగిపో ఒక్కతడినుసి నిన్ను తగిలినా నేను జలపాతమై పోతా నాకు నీ గర్వమొక్కటి మిగిలినా సర్వంసహా చక్రవర్తినౌతా నన్ను పారెయ్ పారెయ్ నిను రాసిన నా అక్షరాలు నాలుగు ఈ ప్రపంచానికి నా వీలునామా, ఎవరు చదువకముందే చెరిపెయ్ ఎవరి పెదవులకు అంటినా వంశీమోహనమౌతా నన్ను పారెయ్ పారెయ్ మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k21cuP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి