పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Chi Chi కవిత

_సెలవు_ క్షణాల్లెక్క తేలదంతే తేలితే తెలివి మునిగినట్టే!! తెల్లారిందో రాత్రయ్యిందో చూస్కుని కళ్ళలిసిపోతే కల్తీ కాలానికి దూరంగా మనసుని లాక్కెల్లే రేయింబవుళ్ళ కలలకే తెలుసు మనసును మనసెలా మోసం చేస్కుంటుందో కాలం లెక్కల్లో!! దూరం చెరిపేసే కలలేవో చూసే కళ్ళకి కాలం నిజమే , కలలూ నిజమే , మోసం నిజమే.. ఆనందంలో ఆగిపోడమే అన్నిటికీ గమ్యమని తెలిసినా అందుకడ్డుపడే నిజాలేవో తెలిసేవరకు మోసం రుచించదు నిజమే అయినా!! దేనికది అదే అవుతుంది ఇంకోదానిక్కూడా..అదేదైనా కూడా!! అవడానికింకేం లేకున్నా ఇంకేదో అవడమే నిజమైన మోసం ఆడమగలన్నీ ఆడే , మగే ..ఇంకేదైనా మోసమే ఇంకా వెతికితే ఆడన్నా మోసమే , మగన్నా మోసమే నిజమే!! ఆగితేనే ఆనందం..సాగేదంతా నిజం బతుకనే సెలవులో గమ్యమై గడిపేయడమే వేషమనే నిజమైన మోసానికి నిజం నుండి విమోచనం.. అప్పుడిక వేషమూ ఆనందమే!!_________(25/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVqM6Q

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి