పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Mercy Suresh Jajjara కవిత

|"రంగులాట..!" | mercy margaret -------------------------------- కొన్ని రంగులు ఆనకట్టలు రిజర్వాయర్ల గేట్లు తెంచుకుని బయటికి ప్రవహంచే సమయం రంగు రంగుకీ కథ ఉంది కథ కథకీ వెనక చాంతాడంత చరిత్రా ఉంది ఒక రంగు ఇంకో రంగులో కలిసేది కాగితం మీదా కాన్వాస్ మీద నిజమే కానీ ఈ రంగులు అయిదేళ్ల వరకు ప్రజల కాలాన్ని తమలో కలుపుకుని ముంచెత్తుతాయో ? ఒడ్డుకు చేర్చుతాయో? ఒక్కో రంగుకీ ఒక గొంతుక కొన్ని రంగులకు గొంతుకలతో పాటు లెక్కలేని నాలుకల్ కూడా మాట మాటాకీ తేడా మాటలతో పేర్చే కోట గోడల బలమూ ఉన్నాయ్ ఇక .. ఇప్పుడు సవాలు విసిరే జాతకాలు రంగులకో రంగుబాబులకో కొన్ని వేళ్లు అగ్గిపుల్లలై తీర్పు చెప్పబోతున్నాయి నేడే చూడండి ఆలస్యం ఎందుకు "రంగులాట..!" _________ Mercy Margaret (29/4/2014)___

by Mercy Suresh Jajjara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kbwcax

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి