పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Katika Manohar కవిత

కటిక మనోహర్ # వాన మబ్బు # నీలాకాశం నలుపురంగు పూసుకుంటోంది నామస్తిష్కం జ్ఞాపకాలరంగు పులుముకుంటోంది తెరలుతెరలుగా నల్లటిమబ్బు ఊరినికప్పేస్తోంది మబ్బుతెరల్లోంచి నాగతానుభవాలుతొంగిచూస్తూ కనిపించాయి బాల్యంలో బడి “ఎగరగొట్టినంత” వేగంగా పోరుగాలి పైకప్పులను ఎగరగొడుతోంది గట్టు మీద మేం తాటాకుబూరలు వూదిన శబ్దాల్లాగ ఆకాశంలో మేఘపుబూరలు ఎవరోవూదుతున్నారు కొమ్మపైని పిట్ట తనవీధిమిత్రుడ్ని పిలిచినట్టు, తలపైకెత్తి గట్టిగా ఎవరినోపిలుస్తోంది తిన్నెలపై ఇసుకగూళ్లకోసం మేం పోటీపడినట్టుగా, ఇక్కడి చెట్లకొమ్మలు పోట్లాడుకుంటున్నాయి చాలా రోజుల తర్వాత పాతమిత్రుడ్ని కలుస్తున్నట్టు అక్కడి జంతువులన్నీ కన్నార్పకుండా ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చున్నాయి ఒకవైపు ప్రళయం వస్తున్నట్టు జనమంతా పరుగులు పెడుతున్నారు కానీ అది ప్రణయం అనితెలిసిన అక్కడిచెట్లు, నేలమ్మను పూలతో అలంకరిస్తున్నాయి మట్టిపరిమళం గుప్పున ముక్కుకు తగులుతోంది ఇంతలో ఎవరో నేలమ్మపై "నీటిముత్యాల్ని" జల్లడం ఆరంభించారు ఆ ముత్యాల మెరుపులో నేలమ్మ మరింత సుందరంగా కనబడుతోంది పిలవకుండానే వచ్చిన అథిదులంతా ఈ ప్రణయవిందుని కళ్ళతో ఆరగించారు నాతో సహాఅక్కడున్న జీవులన్నీ ఈ ప్రణయజ్ఞాపకాల్ని ఇళ్ళకు తీసుకెళ్తూకనిపించాయి.

by Katika Manohar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RXTomx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి