పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Chi Chi కవిత

రంగులేని నింగిరూపమేధైతే ఏంటి అది రాల్చుకున్న చినుకులన్ని రంగులద్దుతుంటే!! ఋతువులన్నొక్కసారి ఊపిరై రగులుకున్నప్రాణంతో రుదిరమురుకుతుంటే తనివి నిండి పొర్లుతున్న మనసు చాలలేదని కప్పుకున్న నింగి రెప్పలార్పుతోంది!! రెప్పపాటు నిద్రలో జారిపోయే వెలుగులో రంగులన్ని కలుపుకున్న చీకటంతా చిటికెలో అద్బుతానికర్థం అంతుచిక్కలేక అర్థమైన భావం మాటకందలేక నింగినై పులుముకున్నచీకటిచ్చే చెలిమిలో వెలుగులద్దే చినుకునొకటై ఎగురుతున్నా కదలకుండా మనసు నింగై , మాట మరుగై!!______(27/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1EvZO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి