పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----------- '' నదీ-నేను '' అలల అలజడులతో నువ్వు సాలెగూడులా కల్లోల అల్లికలతో నేను సారుప్యత ఒక్కటే జీవనదివై నువ్వు జీవితమంతా చిక్కుముడుల జీవంతో నేను . పొంగుతుంటావు,పారుతుంటావు అలుపెరుగక అనునిత్యం నువ్వు శోదిస్తాను ,సాధిస్తాను ,రోదిస్తుంటాను గమ్యం ఏమిటో తెలియక నేను . ఎంత స్వచ్చమో నువ్వు ఏ దేహం మీద నువ్వు ప్రవహించినా ఆ చర్మపు వర్ణంలో మిళితమైపోతావు రంగులు మారుస్తూ నేను నా రంగునే కోల్పోతుంటాను . రాళ్ళముళ్ళను మృదువుగా సహిస్తూ సాగిపోతుంటావు నువ్వు గీసుకున్న దారులవెంట ముళ్ళబాటలను తొక్కుకుంటూ ఎదిగిపోతూ.. ఒక్కోసారి దిగుతూ జారిపోతాను పాతాంలోకి . ఒకరోజు నువ్వు ప్రశ్నిస్తావు నేను విశ్రమిస్తే ఏమవుతావని ? కానీ ఆ రోజు వచ్చినా కూడా నా దగ్గరా జలనిధి ఉందంటూ నా కన్నీళ్లను వర్షిస్తాను ! (13-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ex9sWr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి