పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Trinadh Meegada కవిత

||హోలీ రంగేళీ వసంత ఉత్సవ కేళీ ఆకశాన హరివిల్లై విరిసిన డోలీ జీవితాన రంగులు నింపిన జోలీ శ్వేత వర్ణపు శాంతికేళీ పసుపు వర్ణపు శుభకేళీ ఎరుపు వర్ణపు సిందూర కేళీ నలుపు వర్ణపు మిధ్య కేళీ నీల వర్ణపు నిర్మల కేళీ కష్ట జీవుల ఎండు డొక్కలు పుష్టి జీవుల పండు రెక్కలు పాడుకుంటూ పరవశించే జీవకేళీ అన్నదమ్ముల ఆడబిడ్డల ఆలు మగల ప్రేమ బందపు పట్టు జిలుగులు ప్రేమ పక్షుల ప్రణయ దారుల పురులు గొలిపే విరుల ఝరులు రాణివాసపు అక్కసులకు రక్కసత్వపు రాజనీచులకు జ్ఞాన దీపికలు ఇచ్చు రోజు పెద్దలందరూ పిల్లలయ్యే సాటి లేని మేటి రోజు హోలీ రంగేళీ వసంత ఉత్సవ కేళీ || హోలీ శుభాకాంక్షలతో మీగడ త్రినాధ రావు మన తెలుగు మన సంస్కృతి

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbS77n

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి