పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Amma Akhil కవిత

మృత్యువు Vs ప్రేమ #అమ్మఅఖిల్ 1.మృత్యువు వేయిపడగల నాగులా మారి కోరలు చాచి మరీ కసితో ఉన్నది కాటు వేయాలని నా దేహంలో ఐక్యమవ్వాలని విశ్వప్రయత్నం చేస్తుంది నన్ను చేరుకోవాలని! 2.చాలా తాపత్రయ పడుతుంది ఉరిత్రాడులా మారాలని నన్ను గట్టిగా కౌగిలించుకోవాలని! 3.విషంలా మారి నా గొంతును ముద్దాడుతూ తనువులోకి ప్రవేశించాలని నా ప్రతి అణువులో నిండాలని చాలా తహతహలాడుతుంది పాపం గెలవాలని..! అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మృత్యువు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ విఫలమవుతూనే ఉన్నది పాపం పిచ్చిది..! దానికి తెలియని విషయం ఏమిటంటే.?? 1.నీ తోడు నాకు ఉన్నంతకాలం అది నన్ను సమీపించలేదని నా నరనరాల్లో అది ప్రసరించలేదని! 2.నీ ప్రేమనే రక్షకకవచం నాకు అండగా ఉన్నప్పుడూ నన్ను ఆళింగనం చేసుకోలెదని ఈ గొంతులో ప్రాణాన్ని దోచుకొళ్ళలేదని! 3.నువ్వు నాతో ఉంటే అది నన్ను కనీసం త్రాకలేదని నా అణువణువునా చొచ్చుకొనిపోలేదని!! మర్చిపోయింది ఆ మృత్యువు నా ప్రాణం పోవాలంటే నేను నిన్ను మర్చిపోవాలని... తెలియదు ఆ మృత్యువుకి ఈ శ్వాస ఆగాలంటే నీ మీద నాకున్న ప్రేమ శాశ్వతంగా చావాలని.. మరణానికి కూడా మన ప్రేమ చరమగీతం పాడగలదని!!! $17mar14$

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2huFF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి