పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Sriramoju Haragopal కవిత

మనసులో ఏముంది మనుషులు చీమలై పోతే బాగుండునని బతకడం బతికించడం తెలిసొచ్చునేమోనని చివికి జవచచ్చిన మానవబంధాల్ని కొంచెమన్నా బతికిచ్చుకుందురేమోనని పూసినపుడల్లా మకరందకలశాలయ్యే పువ్వుల్లా తడిగాలి తాకగానే జల్లున చల్లగా కురిసే మేఘాల్లా తడిమట్టిలో చల్లగానే పంటకలలై మొలకెత్తే విత్తుల్లా చన్నిచ్చి రక్తాలు పాలుగా మమతల బంగారుతల్లిలా మనుషులు మనుషుల్లా మారుతారేమోనని మానవీయతతో ఇకనన్నా ఎదుగుతారేమోనని విత్తనంలోని మొలకవాగ్దానాలను మబ్బులోని చినుకు తడులను మట్టిలోని బతికించే గుణాలను పూవుల్లోని మెత్తని పరిమళాలను ....ధరించిన మనుషులే నిండిన చారిత్రక ధరిత్రి కావాలని అంతరాలు తొలిగించుకున్న మానవత్వపు ఆంతర్యాల మనుషులే కావాలని... వుంది మనసులో... ఊరికే పనికిమాలిన భయాలచారిత్రక గాయాలు మోసేదెందుకు? ఊరికే ఉనికిమలిపే భయానకముఖాల జంతువుల్లా బతకాలెందుకు??

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iipotG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి