పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఒకరినొకరు కౌగిలించుకోవడం కాదు, ప్రేమంటే; అవన్నీ కేవలం ఆనందబంధాలు అవి అంతర్గతంగా ఇమిడివున్న పదార్ధభావాలు ప్రేమంటే నిజానికి ఒక అధిభౌతికసంబంధం నిజమైన ప్రేమ ఆవిష్కరింపబడాలంటే అంతరంగంలో అదైహిక భీజం నాటబడాలి మనసు లోలోపల ఆకాశపు వేర్లు పుట్టి తపస్వితపుటాలోచనల్లో జీవవృక్షమై పెరగాలి జీవితం ఎదిగి స్వర్గంతో పెనవేసుకోవాలి హృదయం మమతతో నిండిపోయి గుండె ఆగిపోయినా జీవించగలగాలి ప్రేమే జీవితమై ప్రేమే జ్ఞానమై ప్రేమే మోక్షమై జీవితం ఒక పరమమూలకమై నిలిచిపోవాలి 20Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8l3gj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి