పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Padma Sreeram కవిత

ఒకటి - ఒంటరి అంకె || పద్మా శ్రీరామ్|| అష్టదిక్కులున్నాయి అయినా.... అవని ఒంటరిదే సూర్య చంద్రులున్నారు - అమాసలో ...ఆకాశం ఒంటరిదే సప్తసముద్రాలున్నాయి.. నావికుడికి మాత్రం- దప్పిక తప్పదు నాకూ ప్రేమించే నేస్తాలెందరో - కానీ.....నువ్వు లేని లోటు .....తీరదు పున్నమి చుక్కల మాలలెన్ని తురుముకొన్నా మనసైన చంద్రుడికోసం చూపులు తప్పవన్నట్లు నా చుట్టూ ఎందరున్నా - మనసెరిగిన నువ్వు లేక నా కనులకలత వీడదు అందుకే నీకోసం ఎదురు చూపునైతిని నువ్వు వీడిన ఒక మజిలీనైతిని మనం కలిసున్నపుడు కలబోసుకొన్న చిరు నవ్వులు ఇప్పుడు అర(కొర)నవ్వులైనాయి నేస్తమా అందుకే మనమొక్కసారి కలుద్దాం మన అనుభూతులు కలబోసుకొందాం అవనిపై ఉన్న మన ఆనందాన్ని అంబరమంతగా ఎగరేసుకొందాం ఒక్కసారి రావూ - నా జీవితాన్ని చూసిపోవూ??? అంకితం : పెళ్ళితో విడిపోయిన నా చిన్ననాటి స్నేహితురాలు "లలిత" కు జన్మదిన శుభాకాంక్షలతో ప్రియ నెచ్చెలి "పద్మం" పలికే అనురాగాల పల్లవి 19 Mar 2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1GSOx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి