పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Balu Vakadani కవిత

బాలు వాకదాని||ఆనందనవనం|| చుటూ కొండలు, ఎత్తు పల్లాలు, కొంత మైదానం, మరి కొంత సెలకలు అందంతో ఆకట్టుకొనే పేర్లు తెలియని మొక్కలు, చెట్లు, పిట్టలు, వాటి శబ్ధాలు రంగులన్నీ అద్దుకున్న ఆ ప్రాంతం బాహ్య ప్రపంచాన్ని మరిచేలా చేస్తుంది వన్యప్రాణులతో, వనములికలతో అదో అందమైన ఆనందనవనం ఫాల్గుణమాస మధ్యాహ్న ప్రయాణపు అలసట కాముడి పున్నమి రాకతో వెన్నలలో కలిసిపోయింది మోహన రూపమైన పున్నమి రాత్రి, ‘రాజు’ల నాటి నుంచి నేటి కళ్యాణవైభోగం వరకు స్పృశించి తాటికల్లు పాస్వర్డ్ తో మనసు తెరుచుకొని పాట‘నందు’కుంది, కంజర తాళమేస్తుంది ఎండిన గడ్డి పరకలకందుకున్న నిప్పు పిడకలకు, ఆపై మొద్దులకంటుకొని మా దేహాలపై ఎర్రటి కాంతిని వెదజల్లుతుంది పరిసరాల చల్లదనం, పండు వెన్నల, పైపైకి పోతున్న సంద్రుడు కరుగుతున్న కొవ్వత్తి , మండుతున్న కాముడు, ఆవిర్లు కక్కుతున్న కాఫీ గుడిసలో దీపం, మసక చీకటి, కట్లపోయిపై వండిన బువ్వ కాంతమ్మ, వెంకటయ్యల అభిమానం, రాము శివల స్నేహం, వావ్ వాట్ ఏ బ్యూటీ ఫుల్ నైట్ ‘గురూ’.. బాలు వాకదాని 19-03-2014

by Balu Vakadani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qUyGR7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి