పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Katika Manohar కవిత

మను #హోలీ # రంగుల లోకం మరింత రంగులమయం కదిలే రంగవళ్లుల రమణీయ దృశ్యం భువి పై పరుచుకున్న ఇంద్రవన్నెల అందం వర్ణించలేని వర్ణాలేవో శరీరాలపై శోభితం ఆనవాళ్ళు మరచిన మనుషుల ముఖం ముఖాలపై విరిసిన నవ్వుల పుష్పం ప్రతి చేయి కుంచెగా మారిన క్షణం చిత్రాకారుడు చిత్రించని చిత్రమేదో ఆవిష్కృతం జాతి తేడాలను చెరిపేసిన రంగుల వనం మనుషుల అసలురంగు తుడిచేసిన వైనం ఇది చరిత్రకు అందని చిత్రవైభవం కలకాలం నిలిచేనా ఇలాంటి సంబరం 19\03\14.

by Katika Manohar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OwbDNP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి