పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మార్చి 2014, శనివారం

Chand Usman కవిత

చాంద్ || బోర్లించిన పాత్ర || నువ్వు బోర్లించిన ఈ పాత్ర లోపల ఏముందో అని ఎప్పుడైనా నా గుండెలపై చెవి ఆన్చి వినాలనుకున్నావా..? నాలోపల ఏమీలేదని నీకు ఏమీ దొరకదని ఖాళీ చేసి వెళ్లిపోయావ్ నా శూన్యం ఒక సంద్రం నువ్వు వినగలిగితే దాని ఘోషలో నువ్వు నీకు తప్పక వినబడతావ్ నువ్వు ఓపికగా వెతుకగలిగితే అట్టడుగున దాచుకున్నవన్నీ నీవేగా నువ్వు కలవని తీరానివైనా నిన్ను పొందాలనే ఆరాటంలో నా కెరటాలు ఎప్పుటికీ అలిసిపోవు నీకు తెలియనిది కాదు ఈ సంద్రం ఆరనిది ఎన్ని దాచినా నిండనిది ******* నన్ను బోర్లించే ముందు నా మనసును ఒక్క సారి అడిగుండాల్సింది. మీ చాంద్ || 29.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4dBPf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి