పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

కోడూరి విజయకుమార్ కవిత

గృహస్తులూ ... సంచారులూ (అనువాద కవిత ) గృహస్తులు తమ కోసం తాము నిర్మించుకున్న ఇళ్ళల్లో నివసిస్తారు సంచారులు ఎవరూ నిర్మించని అతి పెద్ద గృహంలో నివసిస్తారు గృహస్తులు కుర్చీలలో కూర్చుంటారు .... వాటి కింద సాలెపురుగులు కదులుతుంటాయి సంచారులు గడ్డి కొండల పైన కూర్చుంటారు ... వాటి కింద వాన పాములు తిరుగుతుంటాయి గృహస్తులు, సంచారులని దొంగలు గా భావిస్తారు భూమినీ, నీళ్ళనీ దొంగిలించిన వాళ్ళని వొదిలేసి, సంచారులు ముందుకు సాగి పోతారు అదే అగ్ని మండుతుంది ... అదే వేడి అందరికీ అందుతుంది చందమామ వెలిగించిన రాత్రి, గృహస్తు - అతడి భార్య నిద్ర పోతారు వెన్నెల వెలుగులు వాళ్ళని తాకవు అదే రాత్రి, తన పురుషునితో కలిసి శయనించిన సంచార స్త్రీ వెన్నెల వర్షం లో తడిసి పోతుంది అదే సూర్యుడు ఉదయిస్తాడు .... అదే సూర్యుడు అస్తమిస్తాడు గృహస్తు భార్య, తన పిల్ల వాడికి స్నానం చేయిస్తుంది వర్షం, సంచార బాలుడికి స్నానం చేయిస్తుంది గొడుగు నీడలో గృహస్తు భార్య, తమ పిల్లాడిని బడికి పంపిస్తుంది సంచార బాలుడి తల్లి, ఎర్రటి ఎండలో, వాడిని వాడి జీవితానికి వొదిలేస్తుంది అదే ప్రకృతి పిలుస్తుంది .... అదే శబ్దం వినిపిస్తుంది గృహస్తుల అమ్మాయి, గృహస్తుల అబ్బాయితో పాటు వెళ్లి పోతుంది ఇద్దరూ ఇంటికే వెళతారు .... సంచారుల పిల్ల, సంచారుల పిలగాడితో పాటు వెళ్ళిపోతుంది మరి, ఈ సంచారుల పిల్లలు ఎక్కడికి వెళతారు ? -మళయాళ మూలం : ఎస్ జోసెఫ్ - కొట్టాయం ఇంగ్లీష్ అనువాదం; ఏ జే థామస్ [21 మార్చి - ప్రపంచ కవితా దినోత్సవం]

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPm877

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి