పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఫిబ్రవరి 2014, గురువారం

Yasaswi Sateesh కవిత

యశస్వి || ఈ వానే కదా!! ... || ఈ శివరాత్రి పగటి పూట శీతాకాలపుటెండ చిరుబురులాడుతున్నా.. దబాటంగా కురిసిందోవాన నాపైన . చూపుడువేళ్ళకి పనిచెప్పకుండా లోనా బయటా కురుస్తోంది వాన నానిపోతున్నానీవేళ పరవశంగా పుత్రపరిష్వంగ రోమాంచితాలను మించి పూలవానలు కురిపించిన గురుతులేవీ నా జీవితానలేవు కవితత్త్వాల స్పందన తడి ఇంకా స్మృతిపథాన ఆరనేలేదు పైలా పచ్చీసు దాటి పుష్కరం ముందుకొచ్చాక ప్రేమలేఖల వినోదానదాలలో ఈదులాడే రోజులుకావివి!! మరెందుకీవేళ టపా అందుకున్నాక ఎందుకింతగా మురిసిపోయాను!! యాభై ఏళ్ళ వానలో ఇలా తడిసిపోయాను!! నిర్జన మైదానం లాంటి నా జీవితాన్ని ఈ వానే కదా ఇరవై ఏళ్ళ కిందటే చుట్టేసింది! నిసర్గ ఆకాసాన్ని చూపించి పువ్వులా నను ఏమార్చింది!! బాధంటే కవిత్వమని, హృదయ పరిచ్చేదన అని, అభ్యుదయపు ఆవలితీరమని చెప్పింది నాకు! ఈ వానే!! అల్లకల్లోల అగాధాల్లోకి దూకి శిరస్సెత్తి శివమెత్తించింది తన రాతల్లోంచి జీవిత సారాన్ని పారించింది ఈ వానే కదా!! చినుకుకీ చినుకుకీ తేడా లేదని కలిపి ఉంచే తడి ప్రేమే నని.. ప్రళయంలో నైనా ప్రణయంలో నైనా దేవుళ్ళను సైతం బతికించే మనిషివై బతకమని అదే తన అభిమతమని.. ఈ వానే కదా మనసు తడిమి నన్నో చినుకును చేసింది! చినుకు చినుకును చేరదిసినట్టు నన్నో చెలమని చేసింది!! కలల్ని, కలువల్ని నాలో మొలిపించింది ఈ వానే కదా!! నాకీరోజు పుస్తకమై కురిసి మురిపించింది.. ఈ వానే కదా!! ఈ వానే కదా!! *** ( కొప్పర్తి మాస్టారు కొత్త పుస్తకం.. “ యాభై ఏళ్ళ వాన పొస్ట్ లో అందుకున్న ఆనందంలో..) =27.2.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MwHGeL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి