పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఫిబ్రవరి 2014, గురువారం

దాసరాజు రామారావు కవిత

# ఈ కవిని చూశారా...విన్నారా .... ------------------------------------ ఎలనాగ : అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. 1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామములో జననం. హైస్కూల్ వరకు స్వగ్రామంలోనే. మెడిసిన్ హైదరాబాద్ లో. 1980- 1986 వరకు నైజీరియాలో ప్రభుత్వోద్యోగం.స్వదేశాగమనం తర్వాత 1989 నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో వివిధ జిల్లాలలో అనేక హోదాల్లో ఉద్యోగం. చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కూడా చేశారు.ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ కమీషనర్ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్ స్థాయి అధికారిగా మే 2012 లో పదవి విరమణ పొందారు. అధికారిగా పనిచేసినపుడు పలు అవార్డులు,బంగారు పతకాలు విశిష్ట సేవలకు గుర్తుగా లభించాయి. హైస్కూల్ రోజుల్లోనే కవితా రచన పట్ల మమకారం పెంచుకున్నారు.ఆనాటి భారతి మొదలు నేటి పాలపిట్ట వరకు వివిధ పత్రికల్లో కవితలు,కథలు,వ్యాసాలు ,పద్యాలు,సమీక్షలు,అనువాదాలు,ప్రామాణికపు పజిళ్ళు ప్రచురితమవుతున్నాయి.సాహిత్యంలో కూడా పలు బహుమతులు,పురస్కారాలు అందుకున్నారు . కవిత్వ రచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేయటం,సంగీతం, ఆయా వాయిద్యాల పట్ల మమేకమై కవిత్వమల్లటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. నగరం లో జరిగే సాహితీసభలలో తరచుగా పాల్గొంటారు .హైదరాబాద్ బాలాపూర్ లోని నక్షత్ర కాలనీ లో నివాసం. వీరి ముద్రిత రచనలు : ------------------------- 1. కలుపు మొక్క - సోమరేట్స్ మామ్ ఆంగ్ల నవలిక The Alien Corn కు అనువాదం ( 2005) రీ( మరో ఇద్దరి అనువాద నవలికల్లో కలిపి ) 2. వాగంకురాలు - వచన కవిత సంపుటి ( 2009) 3. పెన్మంటలు - కోకిలమ్మ పదాలు, గేయసంపుటి ( 2009) 4. సజల నయనాల కోసం - వచన కవితా సంపుటి (2010) 5. మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం - ప్రయోగాత్మక పద్యాల సంపుటి ( 2010 ) 6.అంతర్లయ - వచన కవితా సంపుటి ( 2012 ) 7. అంతస్తాపము - చందోబద్ద పద్యాల సంపుటి ( 2012 ) 8. ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు - అనువాద కథలు (2013) 9. పొరుగు వెన్నెల - అనువాద కవిత్వం ( 2013 ) వీరి అనువాద కవితాశక్తి - మచ్చుకి : సరళత్వం ------------- తాముఉన్నామని తెలుపడానికి ఒక కిలకిలారావం తాము ఉండేవాళ్లమని సూచించే నిమిత్తం ఒక ఈక విదిలింపు తాము ఉండబోతున్నామని నిరూపించేందుకు పొదగడం తాలుకు వెచ్చదనం పక్షులు జీవితాన్ని ఇంతకన్న సరళంగా ఎలా వ్యక్తీకరిస్తాయి ..? మళయాళ మూలం : పి.పి.రామచంద్రన్ ఆంగ్లానువాదం : కె.సచ్చిదానందన్ అమాయకతకు నిదర్శనం ---------------- నియంత అమాయకుడనటానికి నిదర్శనాలెన్నో అతనికి మామూలు గొల్లే తప్ప పులిగోల్లుండవు ఇంకా చెప్పాలంటే మామూలు దంతాలే తప్ప విషపు కోరలుండవు అతని కళ్ళెప్పుడూ ఎర్రబడవు నిజానికి అతని దెప్పుడూ మందహాసమే తరచుగా అతడు నిన్ను ఆహ్వానిస్తాడు తన ఇంటికి తన మృదువైన చేయిని చాచి స్వాగతిస్తాడు ప్రజలు తనకు భయపడతారంటే అతనికి ఆశ్చర్యం నియంత ఇంటిగోడలకు వేలాడే కత్తులూ తుపాకులూ కేవలం అలంకరణ సామాగ్రే శ్రేష్టమైన కళాఖండాలతో అలంకృతమై గొప్ప సంగీతం నినదించే అతని గర్భాగారం ఎంతోఆహ్లాదకర ప్రదేశం బయటికన్నా ఎక్కువ భద్రంగా వున్నామని పిస్తుందక్కడ నియంత ఇప్పుడు బాగా వాసికెక్కాడు అతని భవనాన్ని మృతులు కూడా సందర్శిస్తుంటారు హిందీ మూలం : మంగలేష్ దబ్రాల్ ఆంగ్లానువాదం : నిరుపమాదత్ ( పై రెండు కవితలు " పొరుగు వెన్నెల " గ్రంధం నుండి ..) * వీరిని" కవిసంగమం" కు పరిచయం చేయడం ఒక గొప్ప అనుభవం గా భావిస్తున్న . 27-02- 2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mH1ARI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి