పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || వలపుల సంద్రం || సాగరతీరంలో నీ చెంత ఆలపించిన గాత్రమాధుర్యానికి దేవశంఖాలన్నీ నాదాలు చేయడం ..అద్భుతమే ! నీవు జార్చిన నవ్వుల్ని ఒడిసిపట్టి ఆల్చిప్పలన్నీ స్వాతిముత్యాలకి మెరుగులు పెట్టడం ..అద్భుతమే ! నీ పాదాల్ని తాకిన ..ప్రతి నీటిబిందువు తమదే భాగ్యమని పరవశించడం ..అద్భుతమే ! నీ తీపి గుసగుసలు విని.. నాతొ పాటు తరంగాలు సైతం సిగ్గుతో తలవాల్చడం ..అద్భుతమే ! నీ స్వరమాధుర్యాన్ని విని సంద్రం పరుగుపరుగున ముందుకి రావడం ..అద్భుతమే ! నీ స్నిగ్ధసౌందర్యానికి మెచ్చి సముద్రుడు ..పాలనురగలతో అభిషేకించడం ..అద్భుతమే ! శీతల సమీరాలు సైతం పరిమళాల వాన కురిపించడం ...అద్భుతమే ! నీ పాదముద్రల స్పర్శకు పులకరించిన రేణువులు..ఇసుక సౌధాలు కట్టి నీ రాక కోసం వేచి చూడడం ..అత్యద్భుతమే!

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djx2zj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి