పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Krishna Mani కవిత

అమ్మ వచ్చింది **************** మా అమ్మ ఎక్కడుందో ? నా తల్లి ఎలా వుంటుందో ? అని తోడబుట్టినోల్ల తోడుగా ఆకలి కేకలకు అదిరిన గుండె ! అటు ఇటు ఎటు పోదూ ? నడక తెలియని అమాయకత్వం అరుపుతో నైన పిలువనా ? కాని ఏమని ? కళ్ళు తెరిచే శక్తి లేదు అది రాత్రో పగలో తెలియదు ఉన్నది మట్టిపైనో లేక రాయిపైనో తెలియదు ఉన్నది నీడలోనా లేక ఎండలోనా అర్ధం కాదు తల్లి రాకకై పడిగాపులు ! అమ్మ వచ్చింది అందరిని దగ్గర తీసింది బిరబిరామని పోటి పరుగున ఆ పాల ధారను అందుకొని అలసిన డొక్కల నింపు సమయాన ముక్కు నాలుకతో మమ్ము తడిమి చూపుతున్న ప్రేమ జల్లులో తడుస్తూ ఎరుగని ఆప్యాయతలో ఒదిగినం మమ్మోదిలి ఎళ్లకే అమ్మా అని గట్టిగా హత్తుకొని ములిగినం ! కృష్ణ మణి I 23-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dhP9pi

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి