పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ -|| సాహితీ స్రవంతి విస్తృత సమావేశం ||16.2.2014 మానవ విలువలను నిలబెట్టేదే మిజమైన సాహిత్యమని, అదే సమాజాని సరియైన మార్గంలో నడిపించటానికి ఎంతో దోహదపడుతుందని, నేటి సంక్లిష్ట పరిస్థితులలో సాహిత్య కారుల బాధ్యత ఎంతో వుందని, విష సంస్కృతి వైరస్‌లా వ్యాపిస్తున్న తరుణలో కవులులు, కళాకారులు ప్రజలను తమ రచనలద్వార, కళారూపాలద్వారా చైతన్య పరచాలసిన అవశ్యకత ఎంతోవుందని హైదరాబాద్‌ నుండి వచ్చిన సాహితీ ప్రస్థానం పత్రిక సంపాదకవర్గ బాధ్యులు, వొరప్రసాద్ తమ సౌహార్ద్ర సందేశంలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సాహితి స్రవంతి విస్తృత సమావేశం స్థానిక ఎన్‌.ఎస్‌.సి.కాలనీ ప్రాథమిక పాఠశాలలో 16.2.2014 నాడు కొత్త ఉత్సాహాన్ని అందించిందని, ఈ స్ఫూర్తితో మరింత పటిష్ఠమైన సాహితీ కార్య క్రమాలు నిర్వహించగలమని అందరూ అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని సంపటం దుర్గా ప్రసాద్ ప్రారంభిస్తూ అతిథులను వేదికపైకి అహ్వానించారు. ఈ విస్తృత సమావేశనికి సాహితీస్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి అధ్యక్షతవహించగా, రాష్ట్రకమిటీ బాధ్యులు ఒర ప్రసాద్‌ అతిథిగా విచ్చేసారు. స్థానిక ప్రముఖ కవి, రిటైర్డ్ ఆచార్యులు డా.పి.సుబ్బారావు గారు, రిటైర్డ్ తెలుగు ఉపన్యాసకులు డా.కావూరి పాపయ్య శాస్త్రి, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, డా. సి,హెచ్. ఆంజనేయులు, సాహితీస్రవంతి భద్రాచలం బాధ్యులు మాల్యశ్రి, తాతోలు దుర్గచారి, వీధుల రాంబాబు, కొత్తగూడేం-పాల్వంచ బాధ్యులు ప్రముఖ కథకుడు శిరంశెట్టి కాంతారావు,ఇల్లెందు బాధ్యులు బి.ఇందిర, కటుకోజ్వల రమేష్ , మధిర బాధ్యులు పోతగాని సత్యనారాయణ ప్రతినిధులుగా హాజరైనారు. ఈ సమావేశంలో అధ్యక్షోపాన్యాసం చేస్తూ 199 జనవరి 26 న ప్రారంభమై. గత 15 సంవత్సరాలుగా సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. ఎన్నో సాహితీ సెమినార్లు, కవి సమ్మేళనాలు, కార్యశాలలు, నిర్వహించటం జరిగిందని. కొత్త కవులకు ప్రోత్సాహించటంలో తన వంతు కర్తవ్యాన్ని పోషించిందని, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించిందని, కవితా సంకలనాలు, చరిత్ర-సైన్‌స్ లాంటి అనువాద పుస్తకాలు వెలువరించి విశేష కృషిచేసి రాష్ట్ర వ్యాప్త సాహితీ స్రవంతిగా విస్తరించడమే కాక రాష్ట్ర స్థాయి నుండి సాహిత్య ప్రస్థానం అనే సాహితీ మాస పత్రికను నడుపుతూ పలువురి ప్రశంసలందుకున్నదని తెలిపారు. కార్యదర్శి రౌతు రవి మాట్లాడుతూ త్వరలోనే వార్షికోత్సవాన్ని. వర్క్‌షాప్ నిర్వహించడానికి ఉగాది కవిసమ్మేళనాన్ని అన్ని కేంద్రాలలో నిర్వహించాలని అంతే కాక సాహితీ ప్రస్థానం కు చందా కట్టి ప్రతీనెల మన కార్యక్రమాలను పత్రికద్వారా విస్తృత ప్రచారం చేయాలని కోరారు 15 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా త్వరలో సాహితి కార్యశాల ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల వారికి ఖమ్మంలో నిర్వహించతలచామని, అలాగే, కవితలు, కథలు పోటీలు నిర్వహించాలని, ఎంపికచేసిన వాటితోనూ, సాహిత్య వ్యాసాలతో ఓక ప్రత్యేక సంచిక వెలువరించాలని,21 ఫిబ్రవరి మాతృ భాషాదినోత్సవం జరపాలని, మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాలని, నిర్ణయించామని తెలిపారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. డా,పి.సుబ్బారావు గారు సాహితీ స్రవంతితో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగివున్నానని, వారి అన్ని పార్యక్రమాలలో పాల్గొంటునే వున్నాని. వారు ప్రతీనెల మూడవ ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య అధ్యయన వేదికలో పాల్గొని తన సూచనలు, సలహాలు, యిస్తున్నాన్ని. సదా తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. డా. కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎప్పటిలాగే తన సహాయం, సలహాలు, సూచనలు కొనసాగిస్తానని తెలిపారు. భద్రాచలం, కొత్తగూడేం,పాల్వంచ, ఇల్లందు, మధిర ప్రాంతాలనుండి వచ్చిన సాహితీ స్రవంతి బాధ్యులు తమ నివేదికలు సమర్పించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్‌, స్థానిక సాహితీ స్రవaతి జిల్లా బాధ్యులు ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య ఈ సందర్భంగా తమ గళంలో చక్కని గేయాలు వినిపించారు. ఈ సమావేశంలోనే ఖమ్మం డివిజన్‌ కమిటీని ఎన్నుకోవటం జరిగింది. డా.కావూరి పాపయ్య శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా, సంపటం దుర్గా ప్రసాద్ అధ్యక్షుడుగా, కార్యదర్శిగా కంచర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బండారు రమేష్, ఉరిమళ్ల సునంద. శైలజ, ఉపాధ్యక్షులుగా షేక్.నాజర్, గి. వేణుగోపాల్, వి.పాపాచారి, సభ్యులుగా శ్రీధర్, వట్టికూటి మురళి, రవీందర్, ఇ.ప్రసాదరావు ఎన్నికతో నూతన కమిటీ యేర్పడినట్లయింది. ఈ నూతన కమిటీని సాహితీ స్రవంతి జిల్ల బధ్యులు, రాష్ట్ర బాద్యులు అభినందించారు. చివరలో ఎం.శేషగిరి, కపిల రాంకుమార్ తమ తమ అభిప్రాయాలను తెలిపారు. కార్యక్రమాన్ని విశ్లేషణ్కావిస్తూ కన్నెగంటీ వెంకటయ్య ఓ చక్కటీ గజల్‌ ఆపించి, వందన సమర్పణ చేసారు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f5PvPB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి