పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Abd Wahed కవిత

కెరటాలు, తుఫానులు నా చేతిలొ మిగల్లేదు ప్రవహించే నీరేదీ నా ఉనికిలొ మిగల్లేదు నేనూ నా ప్రతిబింబం మా ఇద్దరిదే అద్దం మాట్లాడే పాత్రలేవి మనకథలో మిగల్లేదు మట్టిబొమ్మ మనుగడపై వర్షాలే కురుస్తున్నా గుండె కరిగె చినుకులేవి మబ్బుల్లో మిగల్లేదు ఆలోచన దుమ్ముధూళి పట్టుకునే తిరుగుతున్న ఎగరేసే దమ్ములేవి ఈ గాలిలో మిగల్లేదు పడకగదిలొ ప్రేమకథల దీపమారిపోతున్నా కంటతడిని కలిగించే చమురు పొగలో మిగల్లేదు వెంటాడే జ్ఙాపకాన్ని అనువదించె ప్రయత్నంలో వెదుకుతున్న పదాలేవి నా భాషలొ మిగల్లేదు బతుకుతోట వీస్తున్నది సుగంధమే కాబోలూ ఆస్వాదన మంచులాంటి పువ్వుల్లో మిగల్లేదు నిశ్వాసల నిట్టూర్పులు కంటి నుంచి రాలుతున్న ప్రాణమేది నడుస్తున్న ఊపిరిలో మిగల్లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpXeKH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి