పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Chi Chi కవిత

_ రోతొక వింత _ fighting రాజా తల్చుకుంటే రాజొక్కడై రాజ్యాలు రాజ్యమవుతాయ్!! item రాణీ తల్చుకుంటే వలచిన రాజు గెలుపులన్నీ పాదాల దగ్గర పడతాయ్!! పగలంతా రాజ్యమే పాడు రాజుకని రాణేడుపోపక్క రాత్రంతా రాణే రంకురాజని రాజ్యమేడుపోపక్క రాణి పగటి రహస్యాలు తెలియక , రాజ్యం చాలక రాజేడుపోపక్క రెండు క్షణాల మధ్య దూరమెంతో ఆలోచించుకుంటూ అసలు క్షణమే లేదని తలకెక్కించుకునే తీరికలేని మంత్రేడుపోపక్క పాపం రొజూ యుద్ధమే రాజ్యానికి రాజ్యంతో!! పైవిధంగా ఇంటిదొంగల కనిపించే , కనిపించని మంటల సస్యశ్యామలత్వంలో ఉన్నట్టుండీ ఓ ప్రేమరాజుకి కిరీటం పట్టక, పుణ్యాత్ముల పుర్రెల్ని కరిగించి పెద్ద కిరీటం చేస్కొడానికి దండయాత్ర పండక్కి బండ్లేసుకొచ్చేశాడు!! యుద్ధం ముగిసేవరకు ఇళ్ళకు తాలమేయకూడదన్నదండోరా విని ప్రజలంతా తాలమేసున్న అంతఃపురం ముందు ఆందోళనకి దిగాక కానీ అర్థమవలేదు యుద్ధం item రాణీ కోసమని lol ఎప్పుడో గురుకులంలో కన్నేసి మిగతా ఒళ్లంతా వెయ్యలనుకునే లోపు రాజ్యం మారిపోయిన రాణిని మరిచిపోలేక యుద్ధం ప్రకటించేసాడా పాపలరాజు!! పాపం రాణీ!! flash back ని go back అనలేక , fresh life కి byebye చెప్పలేక చెలికత్తెలతో చిల్లరేడుపులేడుస్తూ ఇద్దర్రాజుల్లో winner కోసం నిద్దర మానేసి wait చేస్తోంది!! చస్తే రాజు వస్తే రాణి అనే titleతో start అయిన ఈ warలో ప్రజలందరూ valentines అయిపోయారు తొక్కలోది!! మంత్రిమోహన్సింగ్ కి రాణీ కంత్రీ అని తెల్సినా కుడా సిపాయిలకిచ్చే జీతాలకి న్యాయం చేయాలనుకుని రాజుల మగతనాల పందానికి తన తలకాయని కూడా కాసేసాడు!! ఆ విధంగా మొదలైన ప్రేమయుద్దంలో చివరాఖరికి ముగ్గురే మిగిలారు ఇద్దర్రాజులు ఒక రాణి..so, యుద్దమింకా అయిపోలేదు!! ఒకడేమో మొహమ్మద్ గజినీ లాంటోడు , ఇంకోడేమో రజినీకాంత్ లాంటోడు రాణేమో మిగిల్నోడే నా bigboss అని చెప్పి climax start చేసేసింది ఇద్దర్రాజులు కత్తులన్నీ కొట్టుకుని విరిగిపోయాక ఒక నిర్ణయానికొచ్చేసారు ఎవరి తలా తెగేలా లేదు మా ఇద్దరికీ రాణివైపో అని proposal పెట్టేసారు situation అర్థం చేసుకున్న రాణి గారి మెదల్లో ఇంకో మహత్తరమైన idea మొలిచింది futureలో ఇంకో రాజెవడైనా వస్తే వాడితో కుడా fight లేకుండా రాజీ పడిపోవాలనగానే past రాజుకి , present రాజుకి కాళ్ళు , చేతులు కత్తులైపోయాయే తప్ప రాణి గారి creativity మీద కనీసం చిన్న complaint కూడా చేయలేదు ఒళ్లంతా ఏడుస్తున్నా కుల్లుని చంపుకోలేని రాజులు ఇద్దరికీ వద్దనుకుని వెళ్లిపోయారు ఏడ తానున్నాడో రాjaaaaaaaaaaaaa అని పాడుకుంటూ రాణి కూడా పుట్టింటికి వెళ్ళి మరో స్వయంవరానికి సిగ్గుపడుతూ green signal ఇచ్చేసింది.. తర్వాత జరిగిన సర్వేలో తెలిసిందేంటంటే రాజ్యాలన్నీ ఇలానే జనాల నిత్య కల్యాణం , పచ్చ తోరణాలతో విలవిలలాడుతున్నాయని రాజులు రాణులు తప్ప వేరే జనాలే లేరని________________Chi Chi(22/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gW3uMC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి