పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఆగస్టు 2012, గురువారం

మార్పు డెస్క్ టాప్ కు అతుక్కుపోతే రాదు - Gurram Seeta Ramulu



నిన్న ఇఫ్లూ లో కవిసంగమం పేరుతొ దాదాపు ఒక వంద మంది ప్రముఖ, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న పిల్ల కవులు ఒక దగ్గరకు చేరారు, ఈ చేర్చడం వెనుక దీని వేదిక మా ఇఫ్లూ చరిత్ర కూడా చెప్పాలి .ఇక్కడ ఇంటర్ నుండి PhD చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా వివిధ దేశాల సాహితీ సంస్కృతుల ,కలబోసిన ఒక గొప్ప విశ్వ సంస్కృతుల కూడలి అది . నేను 4 ఏళ్ళ కింద అక్కడ పరిశోదకుడి గా చేరా నాకు తెలి
సి అక్కడ తెలుగు వాళ్ళు ఊడ్చే , తూడ్చే వాళ్ళు మాత్రమే తెలుగు ఉనికా !!అస్తిత్వమా!! అంటే అదేంటి తెలుగా ?? అన్నట్లు చూసే అదో వింత లోకం .ఆ వింత లోకం లో నిన్న అంత మంది తెలుగు కవులు తమ కళల కలబోత చేసుకున్నారు. ఇది శాస్త్ర సాంకేతికం తెచ్చిన ఒక మంచో చెడో చెప్పడం మాత్రం కష్టం కానీ, విభిన్న మనస్తత్వాలు ఒక దగ్గరకు చేరడం మాత్రం జరిగింది . ఇక్కడ కవిత్వం లోకానికి ఏం మంచి చేసుద్ది చెడు చేసుద్ది అని చేర్చించడం కంటే రాయాలి అనే తపన , అమాయకత్వం ముఖ్యంగా 20 నుండి 30 ఏళ్ళ వాళ్ళు బయటికి రావడం మంచి పరిణామం , మా ఇఫ్లూ లో ఇలాంటివి నేను వచ్చాక ఒక 40 సమావేశాలు ఏర్పాటు చేశా ఎన్నో సంస్మరణ , సాహిత్య , పుస్తక ఆవిష్కరణలు ఏర్పాటు చేసాం . కాకుంటే నిన్నటి మీటింగ్ నాకు హ్యాపీ గా అని పించింది యెంత అద్భుతంగా రాస్తున్నారు వీళ్ళు . నాకు వ్యక్తి గతంగా ఈ కవులన్న, రాసేవాళ్ళు అన్నా ఇష్టం ఉండదు. కారణం నేను నమ్మే ప్రాక్టికల్ జీవితం. ఇలా కవిత్వ ఊహల్లో తేలే వాళ్ళ వల్ల ఏం జరుగుద్ది అనుకోవడము. ఇది నా వగాహన లోపం కావచ్చు , కాకుంటే నిన్న వచ్చిన వాళ్ళలో ఒక పది మంది అయినా సమాజ హితం కోరే వాల్లుగా అసమ, విలోమ విలువలు తిరగ రాసే వాళ్ళుగా తయారవుతారు అనే చిన్న ఆశ నాకు . వాస్తవానికి ఇఫ్లూలో గాలి పీల్చుకొనే తీరిక కూడా ఉండదు PhD వాళ్లు కూడా ఒకటో తరగతి లాగా క్లాసు కి వెళ్తారు, చదవు లో బాగా రాణిస్తారు , జాతీయ అంతర్ జాతీయ వ్యాప్త ఆలోచనలు కలబోసుకొని ఉంటారు. కాకుంటే ప్రేమ రాహిత్యం మానవతా విలువలు సూన్యం మీ లాంటి కవుల వల్ల అయినా ఇక్కడ వాతావరణ ఏమయినా మారుద్దేమో అనే భావన నాది.

ఇక పొతే నిన్న ఎవరో చదివిన వాక్యం ఇది " రాయలేక పోతున్న కలం -
ఆలోచనల్లో అక్కడే ఆగిపోయిన నా హృదయం - ఒక్కసారి నన్ను నీలో చూపిస్తూ , నా మనసుకు ఆలోచనలకు అయిన అంగవైకల్యాన్ని ఎత్తి చూపిస్తూ......... "

నిజమే రాయాలనుకున్నది రాయలేక పోవడం ఒక అంగ వైకల్యమే , తల్లి కడుపు లోంచి వచ్చిన పసివాడి లో మలిన రాహిత్యం కవికి ఉండాలి , అలా ఉన్నప్పుడే కల్మషం లేని భావన బయటికి రావొచ్చు ఒక ప్రేమ భావన నిన్ను మంచి బావుకున్ని చేసుద్ది అలా ప్రేమించే పసి మనసు ఉండాలి .అలాంటి పసి మనుసులు నిన్న నేను ఎన్నో చూసా . వీటన్నిటి వెనుక యాకూబ్ అన్న తపన ఉంది ఆ తపన ఒక ఎదిగే మొక్కకు కంచ , వేసి పాదుపోసే చేయి లాగా ఉండాలి , ఒకటి నిజం నేటి జీవితం అత్యంత సంక్లిష్ట మయినది దానికి ఒక చిన్న నాలుగు లైన్లు సాంత్వన ఇవ్వవు ఒక కవి అన్నాడు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మేత నిజమే మనం పీపాలు పీపాలు సిరా వొలక బోస్తున్నాం నిత్యం ఎంత హింస చూస్తున్నాం !! మరి ఏది మార్పు , ఆ మార్పు నాలా డెస్క్ టాప్ కు అతుక్కుపోతే రాదు అనే స్పృహ ఉంది. అది మన కవిసంగమానికి కూడా ఉండాలని అలా ఉండే క్రమాన్ని "కవిసంగమం" వేగవంతం చేయాలనీ ..



    • Mercy Margaret జై హో కవి సంగమం .. జై హో యాకూబ్ సర్ :) u wrote well Gurram Seeta Ramulu sir ..:)


    • Yagnapal Raju కవిసంగమం.... ఒక అక్షరోద్యమం.... అందరి కలయిక అద్భుతం.... కొత్తదనపు కవితల ఉషోదయం.... మన జయం నిశ్చయం....


    • Jagathi Dhaathri శుభం భూయాత్ !!!


    • Bvv Prasad ‎'..కాకుంటే ప్రేమ రాహిత్యం మానవతా విలువలు సూన్యం మీ లాంటి కవుల వల్ల అయినా ఇక్కడ వాతావరణ ఏమయినా మారుద్దేమో అనే భావన నాది.. ' అక్కడే కాదు, ఎక్కడైనా కవులనుండీ, కవిత్వాల నుండీ నేను ఆశించేది కూడా అదే, సీతారాములు గారూ..


    • Jilukara Srinivas your report is good. we expect more from new generation. but lets dont put weight on their heads..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి