పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఆగస్టు 2012, గురువారం

కవి సంగమం: తెలుగు ప్రయోగం - telugu.oneindia.in


కవి సంగమం పేర బుధవారంనాడు హైదరాబాదులోని సిఫెల్‌లో కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నర్సింగ రావు, ప్రముఖ కవి కె. శివారెడ్డితో పాటు నేటి తరం కవులు కూడా పాల్గొన్నారు. అఫ్సర్, యాకూబ్, గుడిపాటి వంటి కవులు, కవితా ప్రియులు ఈ సమ్మేళనాన్ని అలరించారు. గుర్రం సీతారాములు వంటి సాహితీ ప్రియులు క్రియాశీలక పాత్ర వహించారు. ఈ కవి సమ్మేళనం కొత్త కవులకు వేదిక ఇచ్చింది. ఫేస్‌బుక్‌ను ఈ కవి సంగమానికి వాడుకున్నారు. ఇది తెలుగు కవితా కార్యరంగంలో ఓ ప్రయోగం. దాని గురించి కవులు కొంత మంది ఫేస్‌బుక్‌లోనే బుధవారంనాడు, గురువారంనాడు తమ అనుభూతిని పంచుకున్నారు. ఆ అనుభూతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
నిన్నటి కవిత్వపు పండుగ గురించి..... ఏ సగమూ సంపూర్ణం కాదు! నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అందుకు కించిత్తు బాధ! అసలు రాగలనో లేదో అనుకున్నాను కానీ వచ్చాను, కొంత సమయం గడపగలిగాను, అందుకు చాలా సంతోషం అనిపించింది. ఎవరైన, ఎక్కడైన కష్ట పడి పనిచేస్తున్నపుడు గౌరవించలేకపోతే, అది కు సంస్కారం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కార్యక్రమం కోసం కవి యాకూబ్ గారు చాలా శ్రమించారు. నిన్న నాకు కనిపించింది వారి శ్రమ అందుకున్న సత్ఫలితం. వారి తో పాటూ మరి కొందరు నిన్న కష్టపడ్డారు. నిన్నటి విజాయనికి కారకులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ముఖ్యంగా వచ్చిన వారికి! ఒక సభకు, సమావేశానికి నిండుదనం ఆహుతులే కదా? ఆ నిండుదనం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చెసింది. అందరూ అశించినట్టు కవిత్వం కావాలి కవిత్వం! అది అక్షరసంకలనం లా కాక భావ సంద్రం లా ఉరకాలి. - ఉషా రాణి కందాళ
నిన్నటి వాతావరణం అంతా కవిత్వంతో నిండిపోవడం చాల బావుంది. తెలియని వారినందరినీ కలిపి చేసిన ఈ సభ కొత్తదనంతో నిండి రొటీన్ కు బిన్నంగా నడిచింది. అతిదుల ప్రసంగం ఎన్నో విషయాలు తెలిపాయి. యాకుబ్ గారి ప్రయత్నం విజయవంతం అయ్యింది.పేరు పేరునా పలకరిస్తూ ఆదరించిన యాకుబ్ గారి ఆతిధ్యం ఎంతో నచ్చింది. వారి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.- శైలజా మిత్ర
నిన్న నా జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు.... ఎంతో మంది సహచరులను కలిశాను.... ఎన్నో అనుభవాలు మూట కట్టుకున్నాను.... ఎనలేని ఆనందంతో.... ఎల్లలు దాటే పారవశ్యంతో గడిపాను.... ఇవన్నీ పంచి ఇచ్చిన కవి సంగమానికి ఎంత ఋణపడి ఉన్నానో.... - యజ్ఞపాల్ రాజు
కవుల సంగమం సంద్రంలా ఉంది నేనో ఈత నేర్చుకునే జీవిలా ఉన్నా సంతోష సంభ్రమాశ్చర్యాలతో - వర్ణలేఖ వారు
ఇన్నాళ్ళూ ....కవిత్వం రాసి, ఏం సాధించాను ఏం సాధించగలను అన్న ప్రశ్న పదే పదే వేదించేది. కాని ఈ రోజు రాలిపొయాయనుకున్న అక్షారాలన్నీ అప్యాయతలై తిరిగొచ్చి నన్ను అల్లుకున్నప్పుడు కవిత్వంతో ఒక నిండైన కుటుంబాన్ని పొందాననే ఒక అనిర్వచనమైన అనిభూతికి లోనయ్యాను - కిరణ్ గాలి
ఈ నాటి కవి సంగమం కవిత్వానికి, కవిత్వంకావాలి కవిత్వం అన్న నినాదానికి అక్షరాల పండుగ చేసుకున్నట్లు అనిపించింది. ఎన్నో కొత్త గొంతుకల్లా అనిపిస్తూ సమాజంమీద ఎక్కు పెట్టిన భాణాలు సూటిగా ఆహుతులైన కవులను ఎంతగానో అలరించాయి - రేణుకా అయోల
ప్రతీవాళ్ళు, వారి,వారి ఇంట్లో జరిగిన/జరుగుతున్న పెళ్ళిలాగ పాల్గోవడం అద్భుతంగా ఉంది. అందరూ కలిసి పనిచేస్తే కొండైనా పిండి అయిపోతుందని నిరూపిస్తున్నారు. చాలా గొప్పగా ఉంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం మరింత గొప్పగా ఉంది. -
కోదండరావు
http://telugu.oneindia.in/sahiti/essay/2012/kavi-sangam-an-experiment-telugu-104236.html

3 కామెంట్‌లు:

  1. కవి సగమం లో కలవడం వీలవుతుందా, తెలుపగలరు.,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. http://www.facebook.com/groups/kavisangamam/ ఈ లింక్ ని చూడండి సర్ / మేడం ............. మీరు పేస్ బుక్ ప్రొఫైల్ కలిగి ఉండాలి, అలా అయితేనే మీరు కవిసంగమంలో కలవడం వీలవుతుంది ........



      ధన్యవాదాలు
      కవిసంగమం

      తొలగించండి
  2. మీ Fcebook account ivvandi sir..cherustaa..idi naa account..https://www.facebook.com/kcubevarma..

    రిప్లయితొలగించండి