పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఆగస్టు 2012, గురువారం

కవి సంగమం జిందాబాద్!! - Subbarayudu G Kameswara


ప్రచురణ అన్నది ప్రాచుర్యం కి సంబంధించిన పదం. అచ్చు వేసినా, అంతర్జాల తరంగాల ద్వారా ప్రససరించినా, కవిత భావానికీ, శబ్దానికీ(శ్రవణానికి) అనుకూలించాలి గానీ అక్షరరూపం లో (దృశ్యం గా) కాదనుకొంటాను. శబ్ద భావ అన్యొన్యత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. నిశ్శబ్దంగా, మనలో మనం చదువుకున్నప్పుడు కూడా శబ్ద తరంగాలు కర్ణాన్త్రాలలో ధ్వనిస్తూనే ఉంటాయి. చేరాత , అచ్చువేత "టెక్నాలజీ"లకి ముందు ప్రాచుర్యం ప్రసారం ( నోటిమాట విని పదే పదే వల్లిస్తూ , ఉచ్చారణ-శ్రవణ)ద్వారానే అయేది కదా! మాధ్యమాలు మారినా, అచ్చు వెయ్యడం కూడా తాళపత్రాలనుంచి, కాగితం దాటి ఒక చిన్న తెర పైకి వచ్చింది... అంతే. పైపెచ్చు, ఎక్కువమందికి చాలా త్వరితంగా అందుతోంది. ...... పుస్తకాలు ప్రచురించండి... వీలయినప్పుడు... కానీ ఇంటెర్నెట్, బ్లాగ్,సోషియల్ నెట్‌వర్కింగ్మీడియా (సాంఘీకరణమాధ్యమాలు) ని విరివిగా,శుభ్రంగా, న్యూనత లేకుండా వాడుకోండి. మీ కవితలను ఇంటెర్నెట్‌పైనే చదివాను కానీ పుస్తకాలు కొని కాదు కదా! మాట వరసకి లైక్ లు కొట్టలేదు కదా! నిర్ద్వందంగా నా అభిప్రాయం చెప్పాను కదా! అందరూ అలాగే మొహమాటం లేకుండా చర్చిన్చుకొన్ది.ఆఫ్సర్ గారో, గుడిపాటి గారో ఏరుకొని ఆంతాలజీ ఎలాగా వేస్తారు. పుస్తకంలో రానివారు ఇంకొంచం పటిష్టంగా రచిన్చడానికి కృషి చేస్తారు. కవి సంగమం జిందాబాద్!! (Printer's Devils: 1. Anyonyata, 2.KarNaantaraalalo, 3.Nirdwandwangaa, 4. CharchinchukonDi 5. RachinchaDaaniki)--Subbu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి