పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

క్రాంతి శ్రీనివాసరావు || జారుడు బండ ||

నిన్నటి జీవితాన్నే
తొడిగి తొడిగి విసుగేసింది

కొత్త చిగురుల కోసం
వేచి వేచి అలుపొచ్చింది

అదే నవ్వూ
అదే పనీ
అదే సంతకం
అదే జీతం
అదే జీవితం

గడి యారం లో ముల్లులా
వయసును కొలుచుకొంటూ
పదవీ విరమణ తలచుకొంటూ
నాకు నేనే యావజ్జీవిత శిక్ష విధించుకొన్నాను

వెన్నెల కురుస్తూనే వుంది
వసంతం వచ్చిపోతూనే వుంది
ఎందులోనూ నేను తడవలేక పోతున్నాను
తామరాకుపై నీటి చుక్కలా
గుండ్రంగా ముడుచుకొని
ఎ సంతోషం అంట కుండా
జీవిత కాన్వాసుపై దొర్లుతూనే వున్నాను

ఎటు కొలిచినా బెత్తెడే
ఎటు చూసినా వత్తిడే
తెగించి త్యజించనూలేను
వరించి సహించనూలేను

నేను నడిచేది జారుడు బండ
కచ్చితంగా పరుగెత్తలేను

నేను వెళ్ళాళ్సింది బోరెడు దూరం
కచ్చితంగా దరిచేరలేను


ఉరివేసిన ఖైదీ
అమలయ్యే వరకు బతికినట్లు

రిక్రూట్ అయ్యుంది మొదలు
రిటైర్ అయ్యేదాకా రొజులు వెళ్ళదీస్తున్నా

07-09-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి