పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

కిరణ్ గాలి ||మృగ రాత్రి||


చీకటి చిరుతపులి చెట్లమించి దూకింది
కాలం కొండచిలువ నోరు తెరిచి కదిలింది

గాలి జాగిలాలు జోరుగా రొప్పాయి
కిటికి కీచురాళ్ళు ఆగి ఆగి అరిచాయి

గోడపైని గండుపిల్లి నీడపైకి దూకింది
భయంతోటి మిడత పిల్ల గుండె ఆగి చచ్చింది

ఊడల మర్రి తొర్రలోన ఉడత ఒకటి నవ్వింది
ఉరవతల స్మశానంలో పీనుగొకటి ఏడ్చింది

చెరువు పక్క గుంటనక్క ఊల పెట్టి పాడింది
నీటి లోని చేప పిల్ల గోల ఆపి చూసింది

కాలు జారి జింకపిల్ల మొసలి నోట చిక్కింది
బావి లోన కప్ప శవం బైటి కొచ్చి తేలింది

తోవ వెనుక చర్చిలోన గుబులు గంట కొట్టింది
తోట లోన గాలి వీచి పువ్వు ఒకటి రాలింది

జ్ఞాపకాల గుడ్లగూబ గుడ్లు మిటకరించింది
దేహపు గబ్బిలం చూరుకింద వణికింది

కోరికల తోడేళ్ళు గుంపులుగా కదిలాయి
కాళ రాత్రి కళ్ళల్లో కదలాడెను వింత నవ్వు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి