పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జులై 2012, మంగళవారం

దేశరాజు॥*కటీపతంగ్‌*॥


Rajesh ఈవజ్రోత్సవపు చలి దినాన
వస్త్రాలతో కప్పుకోలేకే,
మరో శరీరాన్ని కోరామంటావా?
దాహార్తి తీర్చేది కేవలం దేహమేనా?
ఏం కావాలో చెప్పారు కానీ...
ఎందుకు కావాలో ఎవరెైనా చెప్పారా?
కోరా కాగజ్‌ థా ఏ మన్‌ మేరా...

తొందరపడి ఎవరి పేరెైనా లిఖిస్తే ప్రమాదమేనా?
కావాలని కోరితే తల్లిదేం ఖర్మ
మన గుండెకాయనే ఒలిచి అరిటాకులో పెట్టి
మోసలి కన్నీళ్ళ ముందు మోకరిల్లేవాళ్ళం కాదా?
సప్నోంకీ రాణీ ఆయేగీ...నహీ, నీకొక్కడికే కాదు-
అందరికీ ఏదో ఒక రూపంలో...
ఎప్పుడో ఒకప్పుడు ఎదురవ్వక తప్పదు
జిందగీ ఏ సఫర్‌... అంటే ప్రయాణమా? సఫరింగా?
రూప్‌ తేరా మస్తానా... తప్పంతా మనదే...
దేహమే దేవాలయమని భ్రమసి, తేనెలో చీమలా..?
భూలు కొరుూ హమ్‌ సేనా హోజాయే...
జరుగుతుందని కాదు,
ఏదో జరిగిపోయిందనే మా బాధంతా!
గాలి పటం తెగినా, ఎగురుతున్నంత సేపూ అందమే
టైమ్‌ అప్‌ అని, మాకూ తెలుసు
కానీ, పేకప్‌ నాట్‌ నౌ!!

*24.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి