పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, జూన్ 2014, గురువారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| జై తెలంగాణ సిరుల గిరుల కోన || జై తెలంగాణ - సిరుల గిరులకోన - జై తెలంగాణ - నదుల నిధులసీమ వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర - సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ ! గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, - పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై ! శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ - రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా! కవులకు కాణాచిరా నా తెలంగాణ - జానపద కళల నెలవురా నా తెలంగాణ నల్లమల గిరుల లోయల సహజీవనాలు - పాపికొండల రమణీయ దృశ్యాలు నల్లపసిడికి సింగరేణి నేల కొలువు - శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా! చారిత్రిక సురవరం - సదాశివ సంగీతం - అచ్చ తెలుగు పాలకురికి సోముడు హలం పట్టిన భాగవతకవి పోతన - పల్లెపదాల హనుమంతు సుద్దులు ఆడుబిడ్డల బతుకమ్మలాటతో - బంజారడప్పుల రంగేళి హోలిరా ఆదివాసీకూనలలరారు తల్లిరా - రేలపాటలతొ పులకించు నేలరా ఏ యోధుని కదిపినా చాలు - బందగీ ఐలమ్మ త్యాగాల కతలు నైజాము నెదిరించి సాగినా సమరం - ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు కాలాలు గడిచినా మారని బతుకుల - నీటి మూటల గత నేత చేతలు అరువదేండ్ల పట్టుదల సాక్షిగా - రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా! నీటమునిగే ఆటపాటల నేల - సంకటాల బారిపడకుండ గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు - పదిలింగా నిలిచేలా పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ - కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ - అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను - సవరించుకు ముందుకు సాగేందుకు ఆశలు, తీరేలా విరామమెరుగక - అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన! అమరుల త్యాగాలు మనమున నిడుకొని - బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త చేయి చేయి కలిపి చేవతనమూచూపి - నిర్మించుకుందాము మనదైన తెలంగాణ! 01.06.2014/5.6.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdCCqQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి