పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మే 2014, సోమవారం

Kavi Yakoob కవిత

యాకూబ్ | నువ్వు నేనవుతూ ......................................... చెప్పాలనుకుంటాను నా మాటగా పక్కనుంచి మరెవరో అదే చెప్తుంటారు, తమ మాటగా * ఆమె గుర్తొస్తుంది నడుస్తున్న దారిలో తీరా ఇంటిగుమ్మం ముందు ఆమె ఎదురుచూస్తుంది, ఉత్తరంలా * చివరిసారి కన్నీళ్లు పెట్టబోతాను తీరా బుగ్గమీద వర్షం చినుకు, ఆమె స్పర్శలా * పువ్వుకోసం చేయి చాస్తాను నాలోపలి తీగలేవో బంధిస్తాయి, కనిపించని పరిమళంలా * నడుస్తూ నడుస్తూ ఆగిపోతాను వెనక ఎవరో పిలుస్తున్నట్టు తీరా చూస్తే ఎవరూ లేని చీకటితీరం * గాలినై ఆకాశాన్ని గాలిస్తూ పోతాను ఇంతేసి ముఖంతో భూమి నాకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. # *పాతవాచకం | ప్రవహించే జ్ఞాపకం | 19.9.1991

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iF5jL4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి